iDreamPost

Bhadrachalam: రూ.200లతోనే భద్రాచలం యాత్ర.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు!

భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణ్ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలానే ఈ ఏటాది కూడా ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ కల్యాణ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణ్ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలానే ఈ ఏటాది కూడా ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ కల్యాణ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Bhadrachalam: రూ.200లతోనే భద్రాచలం యాత్ర.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు!

హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో శ్రీరామ నవమి ఒకటి.  ఈ పండగ రోజున దేశంలోని అన్ని రామాలయాల్లో సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఇక అయోధ్యనగరం అయితే రామనామస్మరణతో మోగిపోతుంది. అంతేకాక అదే స్థాయిలో మన భద్రాచలంలో రాములోరి కల్యాణ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక సీతరాముల కల్యాణం చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం  పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక త్వరలో శ్రీరామనవమి పండగ రానుంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక ట్రైన్స్ ఏర్పాటు చేశారు.

ఏటా భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అలానే ఈ ఏటాది కూడా ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ కల్యాణ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు ఈ నెల 9న మొదలై 23వ తేదీ వరకు కొనసాగుతాయి. అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచంలో నిర్వహించే రాములోరి కల్యాణ వేడుకను కనురాల చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి ట్రైన్  రూట్ అవకాశం ఉంది.

సికింద్రాబాద్ నుంచి బయలు దేరే మణుగూర్ ఇంటర్ సిటీ, బీదర్, క్రిష్ణ, ఇంటర్ సిటీ, శాతవాహన, చార్మినార్, గౌతమి, గోల్కోండ వంటి ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లు భద్రాచలం వెళ్లేందుకు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్ల ద్వారా కనీసం రూ.200తో భద్రాచలం యాత్ర కోసం వెళ్లవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ రైళ్లు భద్రాచలం వరకు నేరుగా వెళ్లే అవకాశం లేదు. డోర్నకల్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి మళ్లీ బస్ ద్వారా భద్రాచలం చేరుకోవాల్సి ఉంటుంది. మణుగురు ఇంటర్ సిటీ రైళ్లు మాత్రం కొత్తగూడెం వరకు చేరుకుని.. అక్కడి నుంచి బస్సు ద్వారా భద్రాచలంకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇలా ట్రైన్ ద్వారా తక్కువ ఖర్చుతో భద్రాచలంకి చేరుకోవచ్చు.

Ramalayam tour with only 200 04

ఇక మరోవైపు శ్రీసీతారాముల కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లును ఆలయ అధికారులు పూర్తి చేశారు.  కల్యాణ వేడుకను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో ఎండల నుంచి భక్తుల ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా స్వామి వారి తలంబ్రాల పంపిణీ, ప్రసాదాల విక్రయం, గోదావరి స్నాన ఘట్టాల వద్ద భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు తాగునీటి, వసతి సదుపాయం వంటి ఏర్పాట్లను కూడా  అధికారులు సిద్ధం చేశారు.

ఏప్రిల్ 17న శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. అలానే ఏప్రిల్ 20వ తేదిన తెప్పోత్సవం, ఏప్రిల్ 21న ఊంజల్ ఉత్సవం ఉంటుంది. అదే రోజు రామయ్యకు సింహ వాహన సేవను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 22న వసంతోత్సవం, ఏప్రిల్ 23వ తేదిన చక్ర తీర్థం, పూర్ణాహుతి, పుష్పయాగం వంటి పలు కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తంగా స్వామి వారి కల్యాణ వేడుకను చూసేందుకు భక్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి