iDreamPost

కుటుంభంలో రెండో పింఛన్

కుటుంభంలో రెండో పింఛన్

ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో రెండో వ్యక్తి లేదా మహిళకు కూడా పింఛన్‌ మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కుటుంభంలో ఒకరికి మాత్రమే పింఛన్ ఇచ్చేవారు. ఆ కుటుంభంలో వృద్ధుడు, వికలాంగులు ఉన్నా ఎవరైనా ఒకరికే పింఛన్ మంజూరు చేశారు. ఫలితంగా అర్హత ఉన్నా పింఛన్ వచ్చేది కాదు. ఈ పరిస్థితిని ప్రస్తుత జగన్ సర్కార్ మార్చివేసింది. కుటుంభంలో రెండో వ్యక్తికి పింఛన్ ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది.

80 శాతం కంటే అంగ వైకల్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే కుటుంబంలో రెండో వ్యక్తికి పింఛన్‌ మంజూరుకు జగన్ సర్కార్ వీలు కల్పించింది. కిడ్నీ రోగులు, తీవ్రమైన మానసిక వ్యాధితో బాధ పడేవారు, ఎయిడ్స్‌ రోగుల విషయంలో కూడా అదే కుటుంబంలో రెండో వ్యక్తికి కూడా పింఛన్‌ మంజూరుకు చేయనుంది. పింఛన్‌ మంజూరుకు కుటుంబ ఆదాయంతో పాటు పలు అర్హత ప్రమాణాలలో మినహాయింపు ఇస్తూ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి