iDreamPost

ఏపీ: పెన్షన్ కోసం 61 ఏళ్ల మహిళ పోరాటం.. ఎట్టకేలకు ఆయన చొరవతో సాధించి!

  • Published Dec 14, 2023 | 11:05 AMUpdated Dec 14, 2023 | 12:52 PM

ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం వారి జీవన భృతికి పెన్షన్ మంజూరు చేస్తుంది. ఒకవేళ విధి నిర్వహణలో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, పెన్షన్ మంజూరు చేస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం వారి జీవన భృతికి పెన్షన్ మంజూరు చేస్తుంది. ఒకవేళ విధి నిర్వహణలో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, పెన్షన్ మంజూరు చేస్తుంది.

  • Published Dec 14, 2023 | 11:05 AMUpdated Dec 14, 2023 | 12:52 PM
ఏపీ: పెన్షన్ కోసం 61 ఏళ్ల మహిళ పోరాటం.. ఎట్టకేలకు ఆయన చొరవతో సాధించి!

ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారికి రిటైర్‌మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. ఒకవేళ వారు చనిపోతే.. వారి నామినీకి ఆ పెన్షన్ సౌకర్యం ఉంటుంది. అయితే పెన్షన్ ప్రాసెస్ లో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏళ్ళ తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. భర్త చనిపోయి 61 ఏళ్లు గడిచినా పెన్షన్ రాక ఓ మహిళ ఎన్నో కష్టాలు పడింది. ప్రతిరోజూ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి‌పోయింది.. కానీ ఆ మహిళ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన భర్త పెన్షన్ కోసం పోరాడింది.. ఆ మహిళ సమస్య తెలుసుకున్న ఓ వ్యక్తి చొరవతో ఆమె 61 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. ఆ మహిళ ఎవరు, ఆమె పోరాటానికి సాయం చేసిన ఆ వ్యక్తి ఎవరు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

నా భర్త చనిపోయాడు.. నాకు జీవనాధారం ఆయన పెన్షన్.. దయచేసి నాకు పెన్షన్ ఇప్పించండీ అంటూ ఏపీకి చెందిన ఓ మహిళ ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నా కనికరించలేదు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 ఏళ్ల వరకు ఆ మహిళకు పెస్షన్ మంజూరు చేయలేదు.  వాస్తవానికి ఓ ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే.. అతని భార్యకు పెన్షన్ వెంటనే మంజూరు అవుతుంది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ మహిళ ఏకంగా 61 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్షణ్ రెడ్డి ఆమె 61 ఏళ్ల వివాదానికి పరిష్కారం చూపించారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన బి శేషగిరిరావు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూ.. 1962 ఫిబ్రవరి 6వ తేదీన ప్రమాదవశాత్తు చనిపోయాడు.

ఆయన భార్య కృష్ణవేణి పెన్షన్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఆమె తనకు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగిన పని జరగలేదు. అలా 61 ఏళ్ల పాటు ఆమె పోరాటం చేస్తూనే ఉంది. జీవిత చరమాంకానికి చేరుకున్న ఆమె వయసు ఇప్పుడు 82 సంవత్సరాలు.. 2021లో రాష్ట్ర లోకాయుక్తను ఆశ్రయించింది. ఆమె పరిస్థితి చూసిన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ రెడ్డి చలించిపోయారు. కృష్ణవేణి ఫిర్యాదు స్వీకరించి జస్టిస్‌ లక్ష్మణ రెడ్డి వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రభుత్వ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా కాకినాడ ట్రెజరీ అధికారులు మాట్లాడుతూ.. తమకు రాష్ట్ర లోకాయుక్త నుంచి నోటీస్ వచ్చందని.. అయితే ప్రభుత్వ ఉద్యోగి అయిన శేషగిరిరావు సర్వీసు రికార్డులు లభించనందున తాము పెన్షన్ మంజూరు చేయలేదని అన్నారు. 60 ఏళ్లుగా ఓ మహిళ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు విషయం గురించి పట్టించుకోకపోవడంపై ఆగ్రహించిన జస్టిస్‌ లక్ష్మణ రెడ్డి వెంటనే సర్వీస్ రిజిస్టర్ ని తయారు చేసి ఆ మహిళకు రావాల్సిన పెన్షన్ మంజూరు చేయడంతో పాటు, బకాయిని నెల రోజుల్లోపు చెల్లించాలని తీర్పునిచ్చారు. 60 ఏళ్ల పెన్షన్ రూ.5.70 లక్షల బకాయిలతో సహా పెన్షన్ చెల్లించాలని ఆదేశించారు. దీంతో కృష్ణవేణికి కాకినాడ ట్రెజరీ అధికారులు రూ.15.70 లక్షలు చెల్లించినట్లు లోకా యుక్త రిజిస్ట్రర్ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. 61 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన తనకు రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ రెడ్డి న్యాయం చేశారని.. ఆయనకు జీవితాంతం రుణ పడి ఉంటానని కృష్ణ వేణి ధన్యవాదాలు తెలిపింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి