iDreamPost

భారీ వర్షాలు.. పాఠశాలలు బంద్, పలు రైళ్లు రద్దు!

ప్రకృతి విపత్తుల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు. భూకంపాలు, భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రస్తుతం తమిళనాడుపై వరుణ దేవుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు.

ప్రకృతి విపత్తుల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు. భూకంపాలు, భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రస్తుతం తమిళనాడుపై వరుణ దేవుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు.

భారీ వర్షాలు..  పాఠశాలలు బంద్, పలు రైళ్లు రద్దు!

ప్రకృతి సృష్టించే బీభత్సం మాములుగా ఉండదు. ముఖ్యంగా భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు. ప్రస్తుతం తమిళనాడులో వర్షం విజృంభిస్తుంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో  భారీ వర్షాలు కురుస్తోన్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వానాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అంతేకాక లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరడం, విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో జనాలు అల్లాడిపోతున్నారు. కోయంబత్తూరు, తిరువూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. ఇక నీలగిరి ప్రాంతంలో ఉన్న పలు డివిజన్లను వర్షం ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

తాజాగా తిరువారూర్ జిల్లా, పుదుచ్చేరిలోని కారైక్కల్ ప్రాంతంలో స్కూల్స్ కి నేటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో తమిళనాడులో వర్షాలు కారణంగా పలు ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి.  నీలగరి మౌంటైన్ రైల్వేలోని కల్లార్, కూనూర్  సెక్షన్ల మధ్య ట్రాక్ పై కొండ చరియలు, చెట్లు కూలిపడటంతో నవంబర్ 16 వరకు ఆ మార్గాల్లో రైళ్ల రాకపోకాలను రద్దుచేశారు.  దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో వరదలు సృష్టించిన బీభత్సం గురించి అందరికి తెలిసిందే. ఆ సమయంలో పదుల సంఖ్యలో జనాలు మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. తాజాగా తమిళనాడులో అదే తరహ ఘటన పునరావృతం అవుతోంది.

ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. చుట్టు నీరు, కరెంట్ సరఫరా ఆగిపోవడంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహయక చర్యలు ప్రారంభించింది. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి.. వరద ప్రభావిత ప్రాంతంలో సహయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడులో కురిసిన భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి.. తమిళనాడులో ప్రకృతి ఈ స్థాయిలో విరుచకపడటానికి గల కారణం ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి