iDreamPost

జస్టిస్‌ ఈశ్వరయ్యకు ఊరట : జడ్జి రామకృష్ణ అభియోగాలు ఉత్తువేనా..?

జస్టిస్‌ ఈశ్వరయ్యకు ఊరట :  జడ్జి రామకృష్ణ అభియోగాలు ఉత్తువేనా..?

చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ వ్యవహారంలో గతంలో నానాయాగి చేసి, ఏదేదో చూపి, ఇంకెవరి మీదో బురద చల్లాలని చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయి. తాజాగా జడ్జి రామకృష్ణ తో జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ లో దురుద్దేశ పూర్వకంగా కుట్రకోణం తో మాట్లాడినట్లు గతంలో రాష్ట్ర హైకోర్టు విచారణకు ఆదేశాలను దేశ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ అంత తీవ్రత ఏమీ లేదని సుప్రీం అభిప్రాయపడింది.

చిత్తూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ జడ్జి రామకృష్ణ ఓ స్థల వివాడాన్ని పెద్దది చేసి, దాని ద్వారా చిత్తూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుల్ని ఇరికించాలని, వారిని ఇబ్బందులు పెట్టాలని రకరకాల మార్గాల్ల ప్రయత్నించడం సంచలనం అయింది. ఆయన పదే పదే ఆరోపణలు చేయడంతో పాటు, తనపై కొందరు దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. దాని తర్వాత తన ఇంటి నుంచి బయటకు రాకుండా రోడ్డును తొలగించారని కూడా ఆరోపించారు. ఒకటి తర్వాత ఒకటి ఆయన చేసిన ఆరోపణలు అన్ని వీగిపోయాయి.

ఆయనపై దాడి చేసిన కేసులో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. రామకృష్ణ దురుద్దేశ పూర్వకంగానే దాడి చేసారని చెప్పారని, ఆయనే మార్కెట్లో ఉన్న తనను కారుతో ఢీ కొట్టి తర్వాత గొడవ పెట్టుకున్నారని దాడి చేసిన వ్యక్తి అప్పట్లో చెప్పడం సంచలనమైంది. దీంతో పాటు ఆయన చేసిన ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తు జరపడంతో అవన్నీ అవాస్తవంగా తేలాయి.

Also Read : ఎఫ్ఐఆర్ కాపీలో నరేంద్ర మోడీ పేరు

చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను కావాలని అన్ని విషయాల్లోనూ ఇరికిస్తూ ఉన్నారని, తన ఆస్తి విషయంలోనూ అన్యాయం చేయాలని చూస్తున్నారని చెప్పడంతో పాటు జడ్జి రామకృష్ణ దళితుడు కావడం తో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ అంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు దీనిమీద నానా హంగామా చేసి, లబ్ధి పొందాలని చూసిన ప్రభుత్వం వెంటనే అన్ని అంశాల మీద విచారణ చేపట్టింది.

ఈ కేసులలో విచారణ కొనసాగుతుండగానే జడ్జి రామకృష్ణకు జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ చేసి కేసులు తొలగించుకోవాలి అన్న కుట్ర కోణం లో మాట్లాడారని, ఆయన ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ కేసులు అన్ని ఉపసంహరించుకోవాలని బెదిరించినట్లు మాట్లాడారని జడ్జి రామకృష్ణ బహిరంగంగా ఆరోపించడం తోపాటు హైకోర్టులో దీని మీద పిటిషన్ వేశారు. వెంటనే విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిమీద సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చేత విచారణకు ఆదేశించింది.

ప్రస్తుతం హైకోర్టు విచారణ ఆదేశాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాషణ్ రెడ్డి ధర్మాసనం హైకోర్టులో దాఖలైన పిల్ మెరిట్స్ జోలికి తాము వెళ్లడం లేదని, పిల్ మెయింటైనబీలిటీ హైకోర్టు పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ కాల్ లో కుట్రకోణం ఉందో లేదో తేల్చాలన్న విచారణ ఆదేశం ఈ కేసులో అక్కర్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఈ కేసులో జడ్జి రామకృష్ణ గతంలో చేసిన ఆరోపణలతో పాటు జస్టిస్ ఈశ్వరయ్య మీద మోపిన అభియోగాలు పసలేనివిగా తేలిపోయాయి.

Also Read : కరోనా ఎన్నికలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి