iDreamPost

SBI ఖాతాదారులకు శుభవార్త! ఇకపై సులువుగానే..

  • Author Soma Sekhar Published - 09:58 AM, Sat - 26 August 23
  • Author Soma Sekhar Published - 09:58 AM, Sat - 26 August 23
SBI ఖాతాదారులకు శుభవార్త! ఇకపై సులువుగానే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ఉంటాయి. అయితే చాలా మందికి తాము ఏ పథకాలకు అర్హులమో కూడా తెలియదు. దీంతో వారు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక మార్కెట్ నిపుణులు కొంత మంది.. మీ ఆధార్ నంబర్ చెబితే మీరు ఏఏ పథకాలకు అర్హులో చెబుతాం అంటూ కొన్ని యాప్స్ సూచిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్ల చేతిలో పడే ఛాన్స్ లు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ పథకాలను సులభంగా అప్లై చేసుకోవడానికి వీలుగా SBI కొత్త సేవలను ప్రారంభించింది.

కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రజల కోసం ప్రవేశపెడుతోంది. అయితే ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలో చాలా మందికి తెలీకపోవడంతో.. వారు నష్టపోతూ ఉంటారు. ఇకపై ఇలా వారు నష్టపోకుండా తమ ఖాతాదారుల కోసం కొత్త సేవలను ప్రారంభించింది దిగ్గజ బ్యాంక్ SBI. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సులభంగా అప్లై చేసుకోవడానికి వీలుగా నూతన సేవలను ప్రారంభించింది.

ఇక తమ బ్రాంచీల్లోని కస్టమర్ సర్వీస్ పాయింట్ (CSP) దగ్గరికి వెళ్లి.. ఆధార్ నంబర్ ఇస్తే.. మీరు ఏ కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులో అందులో మీ పేరును నమోదు చేస్తారు. జీవన్ జ్యోతి బీమా, ప్రధాన మంత్రి సురక్ష బీమా, అటల్ పెన్షన్ యోజన పథకాల్లో మీ పేర్లను అక్కడి సిబ్బంది నమోదు చేస్తారు. ఇక ఇందుకోసం అకౌంట్ పాస్ బుక్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని సూచిందింది. ఈ సేవలను SBI బ్యాంక్ కస్టమర్లు వినియోగించుకోవాలని సూచించింది. మరి దిగ్గజ బ్యాంక్ SBI తీసుకొచ్చిన కొత్త సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన ప్రాంతానికి పేరు పెట్టిన ప్రధాని మోదీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి