iDreamPost

చేతులు కడుక్కోనే స్థితి నుంచి అవే చేతులతో తర్పణాలు వదిలే పరిస్థితి రాకుడదు – SayNoToFakeNews

చేతులు కడుక్కోనే స్థితి నుంచి అవే చేతులతో తర్పణాలు వదిలే పరిస్థితి  రాకుడదు –  SayNoToFakeNews

శరవేగంగా విస్తరిస్తున్న కరోనా ప్రాణాంతకంగా పరిణమిస్తున్న వేల ప్రభుత్వమూ ప్రజలు కరోనాని అదుపు చేయడంలో నిమగ్నమవుతుంటే కొందరు ప్రభుద్దులు మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నారు . ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వార్తల్లో కొన్ని చూద్దాం.. 

1.తమ దేశ ప్రజల్ని కాపాడుకోలేకపోతున్నామని ఇటలీ దేశాధ్యక్షుడు కన్నీరు కార్చాడు .

అసలు ఈ న్యూస్ లో చూపిన ఫోటో ఇటలీ అధ్యక్షుడు సెరిగో ఫోటో కాదు . బ్రెజిల్ అధ్యక్షుడు జైల్ బోల్స్నారో చిత్రం

2. ఇటలీ నుండి ఇథియోపియా దేశానికి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్ సోకిన వారు ఉన్నారని వారిని కనిపిస్తే కాల్చివేయమని ఆజ్ఞలు జారీ చేశారు .

ఆర్మీ డ్రిల్ లో భాగంగా షూట్ చేసిన వీడియోతో ఫేక్ వార్తని పబ్లిష్ చేశారు . అత్యవసరాలకు తగు జాగ్రత్తలతో బయటికి వచ్చే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందిలాంటి న్యూస్ .

3.రష్యాలో కర్ఫ్యూ విధించినా ప్రజలు బయట తిరుగుతున్నారని 500 సింహాలు రోడ్లపై వదిలిన పోలీసులు .

2016లో ఒక సినిమా కంపినీ జోహాన్స్ బర్గ్ లో సిటీ సెంటర్ వద్ద సినిమా నిర్మాణంలో భాగంగా తీసిన ఫోటో అది. దాని మీద స్థానిక మీడియా రిపోర్ట్స్ చాలా ఉన్నాయి.

4.అమావాస్య రోజు కరోనా శక్తి సన్నగిల్లుతుంది కాబట్టి చప్పట్లు కొడితే వైరస్ చనిపోతుంది .

అంతటితో ఆగారు సంతోషం అర్ధరాత్రి స్మశానంలో పూజలు చేయమనలేదు .సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి నైతిక మద్దతుగా చప్పట్లు కొట్టమన్న ప్రధాని పిలుకు వక్రభాష్యాలు చెప్పటం తప్పే కాదు నేరం కూడా.

5.కోడి మాంసం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది .

ఒక్క ఫేక్ వార్త పౌల్ర్టీ రంగాన్ని కొలుకోకుండా చావు దెబ్బ తీసింది. వీటిని అరికట్టకపోతే కానీ ఫ్యూచర్ లో ఇలాంటి ఫేక్ వార్తలకు ఎన్నో రంగాలు ఆర్ధికంగా బలి కావాల్సిందే

6.హెలీకాఫ్టర్ నుండి వైరస్ ని చంపే మందులు స్ప్రే చేస్తారు కనుక బయట తిరక్కూడదు .

ప్రభుత్వం నుండి ఏ విధమైన సమాచారం లేని ఈ నిరాధార వార్త రూరల్ ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళనలకు గురి చేస్తుంది .

ఇవి కాక ఇంకా మరికొన్ని కూడా వైరల్ అవుతున్నాయి .కొత్తగా ఇంకొన్ని అవ్వొచ్చు వాటిని నమ్మకండి . ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారికి కాసేపు వికృతానందం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు కానీ , ఇలాంటి ఫేక్ వార్తల ప్రచారంతో ప్రజల్లో భయాందోళనలు కలిగించినవాళ్లమవుతాము.

మనం బయట తిరక్కుండా కర్ఫ్యూ పాటించాల్సింది ఇలాంటి వార్తలకు భయపడి కాదు . కరోనా వ్యాప్తి చెందకుండా మనల్ని , భావి తరాన్ని కాపాడుకోవడానికి . ఇప్పుడు బయటతిరగడం అంటే మనల్ని మనం ప్రమాదంలోకి నెట్టుకోవడమే కాదు తోటివాళ్ళను, మన కుటుంబాన్ని కూడా మన చేతులతో మనమే ఆపదలోకి తోయడం .

చేతులు కడుక్కోనే స్థితి నుంచి అవే చేతులతో తర్పణాలు వదిలే స్థితికి రాకుడదనేదే ఈ ప్రయత్నమంతా . ఆరోగ్య శాఖ సూచనలు పాటించండి , ప్రభుత్వ రక్షణ చర్యలకు సహకరించండి . కరోనాని నివారించడంలో భాగస్వామ్యులు కండి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి