iDreamPost
android-app
ios-app

పొలిమేర రేంజ్ మూవీతో సత్యం రాజేశ్ మరో సినిమా! రెడీగా ఉన్నారా?

  • Published Apr 17, 2024 | 7:32 PM Updated Updated Apr 17, 2024 | 7:32 PM

Satyam Rajesh: సత్యం రాజేశ్ కు తెలుగు అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది. కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా కూడా ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు పొలిమేర తరహా అదిరిపోయే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

Satyam Rajesh: సత్యం రాజేశ్ కు తెలుగు అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంది. కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా కూడా ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు పొలిమేర తరహా అదిరిపోయే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

  • Published Apr 17, 2024 | 7:32 PMUpdated Apr 17, 2024 | 7:32 PM
పొలిమేర రేంజ్ మూవీతో సత్యం రాజేశ్ మరో సినిమా! రెడీగా ఉన్నారా?

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న యాక్టర్స్ కి కొదవ లేదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోలుగా ఎదిగిన ఎంతోమంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వారిలో సత్యం రాజేశ్ కూడా ఒకడు. చాలాకొద్ది మందికి మాత్రమే తమ డెబ్యూ సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకునే అదృష్టం దక్కింది. వారిలో రాజేశ్ కూడా ఒకడు. సత్యం సినిమాతో యాక్టర్ గా పరిచయం అయిన రాజేశ్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాడు. నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్ ఎన్నో చేశాడు. తాజాగా హీరోగా కూడా తన సత్తా ఏంటో చాటాడు.

సత్యం రాజేశ్ కు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ, ఇన్నాళ్లు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గానే చలామణి అవుతూ వచ్చాడు. కానీ, పొలిమేర సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఒక సక్సెస్ ఫుల్ హీరోగా చూడటం స్టార్ట్ చేశారు. పొలిమేర, పొలిమేర 2 సినిమాలతో సత్యం రాజేశ్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత పొలిమేర 3 కోసం కూడా ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎదురుచూడటం స్టార్ట్ చేశారు. పార్ట్ 3లో రాజేశ్ పాత్ర మరింత ఎఫెక్టివ్ గా ఉండే ఆస్కారం ఉంది. కథ కూడా మరింత పరుగులు పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే ఈ గ్యాప్ లో సత్యం రాజేశ్ మరో అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పొలిమేర స్థాయి ఒక అద్భుతమైన సినిమాతో రాజేశ్ రాబోతుండటం విశేషం. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలై యూట్యూబ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ మూవీ మరేదో కాదు.. టెనెంట్. నిజానికి పొలిమేరలో సత్యం రాజేశ్ ని ఎంతో కూల్ గా, కామ్ గా చూశారు. కానీ, ఈ టెనెంట్ లో మాత్రం కాసేపు ఎంతో అమాయకంగా కనిపిస్తాడు. కానీ, కాసేపటికే ప్రేమించి, ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసిన ఒక కసాయి భర్తగా చూపించారు.

ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. రాజేశ్ తన పాత్రలో ఉన్న అన్ని వేరియేషన్స్ ని చూపిస్తూ వచ్చాడు. అలాగే ఈ మూవీలో ఎస్తేర్ కూడా ఒక మంచి పవర్ ఫుల్ పాత్రలో కనిపించింది. రాజేశ్ చేసిన హత్య కేసును ఛేదించే ఒక పోలీసు అధికారిగా చూపించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదల కానుంది. నిజానికి పొలిమేర సినిమా కథకు, ఈ టెనెంట్ కథకు ఎక్కడా పొంతన, పోలిక లేదు. కానీ, క్యారెక్టర్ లో ఉండే వేరియేషన్స్, రాజేశ్ యాక్టింగ్ మాత్రం తప్పకుండా ఒకేలా కనిపిస్తున్నాయి. ఈ మూవీ కూడా రాజేశ్ కు బిగ్ హిట్ అందిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. టెనెంట్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet