iDreamPost

సంక్రాంతి సాలిడ్ గా బుక్ అయ్యింది.. హనుమాన్ కి దారేది?

  • Author ajaykrishna Published - 03:14 PM, Fri - 20 October 23

సంక్రాంతి ఫెస్టివల్ కి బాక్సాఫీస్ వద్ద పోటీ అనేది ఎప్పుడు ఉండేదే. స్ట్రెయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ సినిమాలకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. మూడు సినిమాలకు మించి పెద్ద సినిమాలు రిలీజ్ అయితే మాత్రం.. ఖచ్చితంగా ఏదొక సినిమాకు అన్యాయం జరుగుతుంది.

సంక్రాంతి ఫెస్టివల్ కి బాక్సాఫీస్ వద్ద పోటీ అనేది ఎప్పుడు ఉండేదే. స్ట్రెయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ సినిమాలకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. మూడు సినిమాలకు మించి పెద్ద సినిమాలు రిలీజ్ అయితే మాత్రం.. ఖచ్చితంగా ఏదొక సినిమాకు అన్యాయం జరుగుతుంది.

  • Author ajaykrishna Published - 03:14 PM, Fri - 20 October 23
సంక్రాంతి సాలిడ్ గా బుక్ అయ్యింది.. హనుమాన్ కి దారేది?

వచ్చే సంక్రాంతి రేసులో చాలా సినిమాలు పోటీకి రెడీ అవుతున్నాయి. అందులో అన్ని పెద్ద సినిమాలే కావడం కంగారు పెడుతున్న విషయం. కంగారు ఎందుకంటే.. రెండు లేదా మూడు పెద్ద సినిమాలు విడుదలైతేనే థియేటర్స్ వద్ద పెద్ద రచ్చ జరుగుతుంది. అందులోనూ పెద్ద సినిమాతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా పండుగ వేళను క్యాష్ చేసుకోవాలని చూస్తుంటాయి. సో.. సంక్రాంతి ఫెస్టివల్ కి బాక్సాఫీస్ వద్ద పోటీ అనేది ఎప్పుడు ఉండేదే. స్ట్రెయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ సినిమాలకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. మూడు సినిమాలకు మించి పెద్ద సినిమాలు రిలీజ్ అయితే మాత్రం.. ఖచ్చితంగా ఏదొక సినిమాకు అన్యాయం జరుగుతుంది.

2023 సంక్రాంతి రేసు కోసం స్టార్ హీరోల సినిమాలన్నీ ఇప్పటినుండి సిద్ధం అవుతున్నాయి. ఆల్రెడీ మూడు నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయని తెలిసి కూడా.. పోటీకి రావడంలో ఏమాత్రం తగ్గట్లేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి అరడజను సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకుని ఉన్నాయి. అందులో మూడు సినిమాలకు తోడు డబ్బింగ్ సినిమాలకు అడ్జస్ట్ చేయడం కష్టమని ఈ ఏడాది చూసారు. అలాంటిది అరడజను సినిమాలు అంటే.. ఎంత కష్టమో అర్ధం చేసుకోవచ్చు. అయితే.. ఇప్పుడున్న వాటికీ మించి ఇంకా సినిమాలు పోటీకి వస్తే మాత్రం పరిస్థితి ఖచ్చితంగా చేయిదాటిపోతుంది. గతంలో చూశాం.. టాక్ బాగున్న సినిమాలు కూడా పోటీ వల్ల నష్టాలు చూసాయి.

టాక్ బాగున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టే అవకాశం అయితే ఉండకుండా పోతుంది. ముఖ్యంగా అన్ని సినిమాలు పోటీపడితే టాక్ బాలేదని వచ్చిన సినిమా పూర్తిగా నష్టపోయే ఛాన్స్ లేకపోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో గుంటూరు కారం, ఈగిల్, సైందవ్, నా సామిరంగా, హనుమాన్ సినిమాలు రిలీజ్ కన్ఫర్మ్ చేసుకోగా.. కొత్తగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రేసులోకి వచ్చింది. వీటిలో దేనికవే తగ్గేదేలే అంటున్నాయి. కానీ.. ఎప్పటినుండో అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న ‘హనుమాన్’ నుండి మాత్రం ఎలాంటి ఊసు లేదు. సంక్రాంతికి వస్తుందా లేదా? అనే డౌట్ కూడా రైస్ అవుతోంది. ఇది వస్తుందని కన్ఫర్మ్ చేస్తే మాత్రం.. అక్కడితో వేరే సినిమాలకు ఛాన్స్ లేనట్లే. అసలు ఈ రేసులో హనుమాన్ మూవీకి థియేటర్స్ దొరకడం కష్టం కావచ్చు. సినిమా రెడీగా ఉన్నా.. థియేటర్స్ దొరక్క రీచ్ జనాలకు రీచ్ అవ్వడం కూడా కష్టం అవుతుంది. సో.. హనుమాన్ కోసం ఇంకో డేట్ చూస్తారా లేక సంక్రాంతికే వస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరి సంక్రాంతి మూవీస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి