iDreamPost

వీడియో: ధోనిని మించిన కీపింగ్‌! ఇది సార్‌ సంజు శాంసన్‌ అసలు రూపం!

  • Published Apr 14, 2024 | 1:07 PMUpdated Apr 14, 2024 | 1:07 PM

Sanju Samson Run Out: రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటే లక్ష్యంగా సంజు శాంసన్‌ బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. తాజాగా ఓ అద్భుతమైన రనౌట్‌ చేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Sanju Samson Run Out: రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటే లక్ష్యంగా సంజు శాంసన్‌ బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. తాజాగా ఓ అద్భుతమైన రనౌట్‌ చేశాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 14, 2024 | 1:07 PMUpdated Apr 14, 2024 | 1:07 PM
వీడియో: ధోనిని మించిన కీపింగ్‌! ఇది సార్‌ సంజు శాంసన్‌ అసలు రూపం!

సంజు శాంసన్‌ ఇప్పటికే చాలా ఫేమ్‌ వచ్చిన క్రికెటర్‌. చాలా చిన్న వయసులోనే ఐపీఎల్‌లో ఓ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికై.. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. కానీ, టీమిండియాలోనే తన ప్లేస్‌ను పర్మినెంట్‌ చేసుకోలేకపోతున్నాడు. అడపాదడపా అవకాశాలు తప్పితే.. ధోని తర్వాత ఖాళీ అయిన వికెట్‌ కీపింగ్‌ కమ్‌ బ్యాటర్‌ స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నాడు. ఆ స్థానాన్ని పంత్‌ ఆక్యూపై చేసినా.. రోడ్డు ప్రమాదంతో జట్టుకు చాలా కాలం దూరం అయ్యాడు. దీంతో.. మరోసారి టీమిండియా వికెట్‌ కీపర​్‌ కమ్‌ బ్యాటర్‌ స్థానం కోసం పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఓ అద్భుతమైన రనౌట్‌తో పోటీలో తాను ముందు ఉన్నానని సంజు శాంసన్‌ చెప్పకనచెప్పాడు.

శనివారం ఛండీఘడ్‌లోని మల్లాన్‌పూర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో శాంసన్‌ కళ్లు చెదిరే రనౌట్‌ చేశాడు. సంజు చేసిన ఈ స్టన్నింగ్‌ ఫీట్‌ చూసి.. టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని మించి పోయేలా ఉన్నాడే అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ఎందుకంటే.. ఆ రనౌట్‌ అంత అద్భుతంగా ఉంది. సంజూ శాంసన్ స్టన్నింగ్ రనౌట్‌కు పంజాబ్ కింగ్స్ డేంజరస్ బ్యాటర్ లియామ్ లివింగ్‌ స్టోన్ పెవిలియన్ చేరాడు. ఈ సూపర్‌ రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చాహల్ వేసిన 18వ ఓవర్‌లో ఈ రనౌట్‌ చోటు చేసుకుంది.

ఆ ఓవర్ ఐదో బంతిని పుల్ టాస్‌గా వేయగా అషుతోష్ శర్మ డీప్ మిడ్ వికెట్ వైపు ఆడాడు. లివింగ్ స్టోన్ రెండో రన్‌కు ప్రయత్నించగా.. ఫీల్డర్ బంతిని అందుకోవడం చూసిన అషుతోష్ శర్మ రన్‌కు రాలేదు. అప్పటికే హాఫ్ పిచ్ వరకు వచ్చిన లివింగ్ స్టోన్ యూటర్న్ తీసుకోగా.. తనూష్ కోటియన్ త్రోను అద్భుతంగా అందుకున్న సంజూ.. వికెట్లకు చాలా దూరం నుంచే బంతిని వికెట్లవైపు విసిరాడు. కనీసం వికెట్లను చూడకుండా బాల్‌తో వికెట్లను కొట్టడం హైలెట్‌గా నిలిచింది. శాంసన్ చేసిన స్టన్నింగ్ రనౌట్‌‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి ఈ స్టంపింగ్‌తో ధోనిని మించిన వికెట్‌ కీపర్‌ అవుతాడని క్రికెట్‌ అభిమానులు అంటుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి