iDreamPost

Sandeep Vanga: సందీప్ వంగా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

  • Published Feb 03, 2024 | 1:49 PMUpdated Feb 03, 2024 | 1:49 PM

ఇటీవల వచ్చిన 'యానిమల్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగాకు పైన చెప్పినట్లు ప్రశంసలు, ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. అయితే సినీ పరిశ్రమలో ఉంటూనే మరీ అడ్డంగా తన సినిమాని విమర్శించే వారి పై సందీప్ వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో ఉండే గాఢతతో పాటు బయట ఆయన ఏ విధమైన భయం లేకుండా మాట్లాడే తీరుకు కూడా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఆయన సినిమాల్లోని కొన్ని సన్నివేశాల పై, సంభాషణల పై వివాదం చెలరేగినా సందీప్ చెక్కు చెదరలేదు.

రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా ఇటీవల వచ్చిన ‘యానిమల్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగాకు పైన చెప్పినట్లు ప్రశంసలు, ఎదురుదెబ్బలు కూడా తగిలాయి. బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. థియేటర్లలో ఎలాగైతే కాసుల వర్షం కురిపించిందో ఓటీటీలో కూడా రికార్డులు కొల్లగొట్టింది. అయితే సినీ పరిశ్రమలో ఉంటూనే మరీ అడ్డంగా తన సినిమాని విమర్శించే వారి పై సందీప్ వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర సినిమాల్లో ఎన్నో అభ్యంతరకరమైన సన్నివేశాలను పరిగణనలోకి తీసుకోకుండా వాటి పై ఏమీ స్పందించకుండా తన పై తన సినిమా పై ఎలా దాడి చేస్తారని సందీప్ రెడ్డి వంగా ప్రశ్నించారు.

యానిమల్ సినిమాను విమర్శించిన వారిలో ప్రముఖ బాలీవుడ్ నటులు, రచయితలు కూడా ఉన్నారు.నిజానికి విడుదల రోజు నుంచి తమ సినిమాను విమర్శించిన ఎవరినీ టీం యానిమల్ వదల్లేదు. ప్రతీ విమర్శకు ఘాటుగా స్పందించారు. అందుకే విమర్శలకు దీటుగా స్పందించే సందీప్ వంగా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అని ఆయన అభిమానులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి