iDreamPost

Sandeep Sharma: 5 వికెట్లతో ముంబైని ఓ ఆటాడుకున్న సందీప్ శర్మ.. ఖాతాలో అరుదైన ఘనత!

రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబైని ఆటాడుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ రేర్ ఫీట్ ను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబైని ఆటాడుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ రేర్ ఫీట్ ను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Sandeep Sharma: 5 వికెట్లతో ముంబైని ఓ ఆటాడుకున్న సందీప్ శర్మ.. ఖాతాలో అరుదైన ఘనత!

IPL 2024లో భాగంగా జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ స్టార్ బౌలర్ సందీప్ శర్మ 5 వికెట్లతో చెలరేగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి.. తమ నిర్ణయం ఎంత తప్పో తొలి ఓవర్లోనే తెలిసింది. సీనియర్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ మెుదటి ఓవర్ 5వ బంతికే రోహిత్ శర్మ(6)ను ఔట్ చేసి.. ముంబై వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత సందీప్ శర్మ చెలరేగిపోయాడు. తనకే సాధ్యమైన స్వింగ్ తో ముంబై ప్లేయర్లను పెవిలియన్ కు క్యూ కట్టేలా చేశాడు. ఈ క్రమంలోనే 5 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా సందీప్ ఖాతాలో రేర్ ఫీట్ చేరింది.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ బౌలర్ సందీప్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ లాంటి కీలక ప్లేయర్లను ఔట్ చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి.. 5 వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి,కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ సీజన్ లోనే అత్యుత్తమ గణంకాలను తన పేరిట నమోదుచేసుకున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో అత్యుత్తమ బౌలింగ్ ను క్రియేట్ చేశాడు.

దీంతో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ముంబై బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 21 పరుగులకు 5 వికెట్లు పడగొట్టిన రికార్డును బ్రేక్ చేశాడు సందీప్. కాగా.. ఈ సీజన్ లో ఇది 3వసారి 5 వికెట్లు తీయడం. లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ కూడా గుజరాత్ పై ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డులతో పాటుగా రాజస్తాన్ తరఫున 5 వికెట్లు తీసిన 4వ ప్లేయర్ గా నిలిచాడు. అయితే సందీప్ రాణించినప్పటికీ.. ముంబై 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ 65 పరుగులతో, యంగ్ బ్యాటర్ నేహల్ వాధేర 49 రన్స్ తో రాణించారు. మరి 5 వికెట్లతో సందీప్ శర్మ చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి