iDreamPost
android-app
ios-app

చావు, ప్రేమపై సమంత ఎమోషనల్‌ పోస్టు!

  • Published Jul 04, 2023 | 11:42 AM Updated Updated Jul 04, 2023 | 11:42 AM
  • Published Jul 04, 2023 | 11:42 AMUpdated Jul 04, 2023 | 11:42 AM
చావు, ప్రేమపై సమంత ఎమోషనల్‌ పోస్టు!

సౌత్‌ క్వీన్‌ సమంత జీవితం విడాకులకు ముందు.. ఆ తర్వాత అన్నంతగా మారిపోయింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె మానసికంగా.. శారీరకంగా చాలా ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. దానికి తోడు మైయోసైటిస్‌ వ్యాధి కారణంగా ఆమె మరింత ఇబ్బందులు పడ్డారు. కొన్ని నెలల పాటు మానసికంగా.. శారీరకంగా నరకం అనుభవించారు. ఇంటికి, హాస్పిటల్‌కు మాత్రమే పరిమితం అయ్యారు. ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది. ఇక, పెళ్లి, అనారోగ్యం కారణంగా సమంత జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అందుకే ఆధ్యాత్మికత, బావుకత వైపు మగ్గారు. తన ప్రస్తుత జీవితాన్ని ప్రతిబింభించేలా తరచుగా తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.

సమంత.. తాజాగా, చావు, ప్రేమ, ప్రశాంతతలపై తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ రెండు స్టోరీలు పెట్టారు. ఓ స్టోరీలో.. ‘‘ మనల్ని చావు నుంచి ఏదీ కాపాడలేకపోతే.. కనీసం జీవితం నుంచి ప్రేమ అయినా కాపాడుతుంది’’ అని ఓ స్టోరీ పెట్టారు. మరో స్టోరీలో.. ‘‘ ఫ్లూవియోఫైల్‌.. వర్షంలో ప్రశాంతత, నిశబ్ధం, సంతోషాన్ని వెతుక్కునే వ్యక్తి’’ అని పెట్టారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. సమంత ఏ ఉద్దేశ్యంతో ఈ స్టోరీలు పెట్టిందో తెలియక అల్లాడిపోతున్నారు. కొంతమంది ఆమె దీన్ని తన మాజీ భర్త కోసం పెట్టిందని భావిస్తున్నారు.

Smantha about death times

కాగా, సమంత ప్రస్తుతం తెలుగులో ‘ఖుషీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మరో వైపు ఆమె ‘చెన్నై స్టోరీ’ అనే బైలింగువల్‌ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళం, ఇంగ్లీష్‌లో ఏక కాలంలో తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆమె ‘సిటడెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తున్నారు. మరి, చావు, ప్రేమలపై సమంత పెట్టిన ఎమోషనల్‌ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş