iDreamPost
android-app
ios-app

మీరే నా హీరో.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

  • Author Soma Sekhar Published - 06:00 PM, Sun - 26 November 23

సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి ఫోకస్ ను తన ఆరోగ్యంపై పెట్టింది. అయితే తాజాగా సామ్ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి ఫోకస్ ను తన ఆరోగ్యంపై పెట్టింది. అయితే తాజాగా సామ్ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Published - 06:00 PM, Sun - 26 November 23
మీరే నా హీరో.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

సాధారణంగా ఇండస్ట్రీకి సంబంధించిన నటీ, నటులు సందర్భం వచ్చినప్పుడల్లా అవతల వ్యక్తులపై ఉన్న ప్రేమను వెల్లడిస్తూ ఉంటారు. సినిమా ఈవెంట్స్ లో, ఇంటర్వ్యూల్లో, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ల్లో లేదా ఓ సినిమా చూసిన తర్వాత అందులో హీరో, హీరోయిన్ల పాత్రలపై తమ ప్రేమను తెలియపరుస్తూ ఉంటారు. తాజాగా ఓ నటుడిని మీరే నా హీరో అంటూ ఆకాశానికి ఎత్తేసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. మూవీలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపై ఫుల్ ఫోకస్ పెట్టింది ఈ భామ. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. నచ్చిన సినిమాలు చూస్తూ రిలాక్స్ అవుతోంది. అయితే తాజాగా సామ్ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

సమంత.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి ఫోకస్ ను తన ఆరోగ్యంపై పెట్టింది. మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకున్న సామ్.. ఆ తర్వాత కూడా దానికి సంబంధించిన చికిత్సలు తీసుకుంటూనే ఉంది. ఇటీవలే గడ్డ కట్టే చలిలో ఉన్న పోస్ట్ ను షేర్ చేసిన సమంత.. తన ఆరోగ్యం గురించి ఎంత కఠిన చికిత్స తీసుకుంటుందో అందిరికి తెలియజెప్పింది. ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా సామ్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. అభిమానులతో ముచ్చటిస్తూ.. తనకు నచ్చిన సినిమాలు చూస్తూ.. రిలాక్స్ అవుతోంది. ఇక తాజాగా సీనియర్ హీరో మమ్ముట్టి, జ్యోతికల కాంబినేషన్ లో వచ్చిన ‘కాథల్ ది కోర్’ అనే సినిమాను చూసి.. టీమ్ ను ప్రశంసల్లో ముంచెత్తింది.

తన ఇన్ స్టా స్టోరీలో ఈ విధంగా రాసుకొచ్చింది. “ఈ మూవీ చూస్తే మీకు మీరే మంచి చేసుకున్నవారు అవుతారు. డైమండ్ లాంటి చిత్రం.. మమ్ముట్టి సార్ మీరే నా హీరో. ఈ మూవీలోంచి బయటపడేందుకు నాకు చాలా కాలం పడుతుంది. జ్యోతిక లవ్ వ్యూ.. జియో బేబీ మంచి దర్శకుడు” అంటూ చిత్ర బృందాన్ని ఆకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం సామ్ పోస్ట్ చేసిన ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. కాథల్ ది కోర్ స్వలింగ సంపర్కం అనే కాన్సెప్ట్ పై వచ్చింది. స్వలింగ సంపర్కంపై సినిమా కావడంతో ఖతార్, కువైట్ దేశాలు ఈ సినిమాను తమ దేశాల్లో రిలీజ్ కాకుండా బ్యాన్ చేశాయి. తాజాగా విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ముందుకు సాగుతోంది.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetMarsbahisgalabetHoliganbet