iDreamPost
android-app
ios-app

జాహ్నవి మరణంపై ఎమోషనల్‌గా స్పందించిన సమంత!

జాహ్నవి మరణంపై ఎమోషనల్‌గా స్పందించిన సమంత!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుల జాహ్నవి అమెరికాలో రోడ్డు ప్రమాదం కారణం చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతున్న జాహ్నవిని పెట్రోలింగ్‌ వాహనం ఢీకొట్టింది. దీంతో జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అమెరికన్‌ పోలీస్‌ అధికారి.. జాహ్నవి మరణాన్ని అపహాస్యం చేశాడు. ఇందుకు సంబంధించిన బాడీ క్యామ్‌ వీడియో వైరల్‌గా మారటంతో ప్రపంచ వ్యాప్తంగా అతడిపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.

జాహ్నవి కుటుంబానికి న్యాయం జరగాలంటూ సోషల్‌ మీడియా వ్యాప్తంగా ఓ యుద్ధమే జరుగుతోంది. తాజాగా, జాహ్నవి మృతిపై స్మైలింగ్‌ క్వీన్‌ సమంత స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టారు. ‘‘ గుండె ముక్కలవుతోంది.. జాహ్నవి కందుల నీ ఆత్మ శాంతించు గాక!’’ అని రాసుకొచ్చారు. ఇక, జాహ్నవి యాక్సిడెంట్‌ కేసు దర్యాప్తునకు సంబంధించి అమెరికా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వీలైనంత త్వరగా కేసును దర్యాప్తు చేయిస్తామని తెలిపింది.

Samantha emotional post about jahnavi death

కాగా, సమంత ప్రస్తుతం మైయోసైటిస్‌ చికిత్స కోసం అమెరికాలో ఉన్నారు. ఓ వైపు చికిత్స తీసుకుంటూ.. మరో వైపు అమెరికా లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తున్నారు. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన సమంత ఫ్యాన్స్‌ కోసం వీలైనన్ని అప్‌డేట్లు ఇస్తూ పోస్టు చేస్తూ ఉన్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. మరి, అమెరికాలో పోలీస్‌ అధికారి నిర్లక్ష్యం కారణంగా బలైన కందుల జాహ్నవి మరణంపై సమంత స్పందించటం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş