iDreamPost

అందరూ చూస్తుండగా రిపోర్టర్ కు ముద్దుపెట్టిన సల్మాన్ ఖాన్! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Updated - 01:16 PM, Fri - 24 November 23

అందరూ చూస్తుండగానే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ లేడీ రిపోర్టర్ కు ముద్దుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

అందరూ చూస్తుండగానే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ లేడీ రిపోర్టర్ కు ముద్దుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

  • Author Soma Sekhar Updated - 01:16 PM, Fri - 24 November 23
అందరూ చూస్తుండగా రిపోర్టర్ కు ముద్దుపెట్టిన సల్మాన్ ఖాన్! వీడియో వైరల్..

సినీరంగంలో సెలబ్రిటీస్ నిత్యం ఏదో ఒక ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. అందులోనూ సోషల్ మీడియా వాడకం అనేది ఇప్పుడు మరింత అందుబాటులో ఉంది. కనుక ఎంత పెద్ద స్టార్ హీరో ,హీరోయిన్ అయినా వాళ్లు చేసే పనులు క్షణాల్లో వైరల్ అవుతాయి. సోషల్ మీడియా మనం ఎంతగానో అభిమానించే స్టార్లను మనకు మరింత దగ్గర చేసింది. వాళ్లు చేసే మంచి పనులు,సేవా కార్యక్రమాలు , మూవీ అప్డేడ్స్ ఇలా ఏ పనులు చేసినా.. వెంటనే వైరల్ అయిపోతాయి.  కొన్ని సందర్భాల్లో పాపం ఈ ట్రోల్స్ తో సినీతారలు ఏకాంగా సోషల్ మీడియానే విడిచిపెట్టిపోదాం అనుకునే రేంజ్ లో ఉంటాయి. సాధారణంగా సెలబ్రిటీస్ ట్రోల్స్ కి గురికావడం కొత్త కాదు.  తాజాగా ఓ రిపోర్టర్ కు ముద్దుపెట్టిన విషయంలో బాలీవుడ్ కండల వీరుడు ట్రోల్స్ కు గురౌతున్నాడు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏం చేసినా.. అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఆడియాన్స్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది మరి. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు అది రికార్డ్స్ కొల్లగొట్టాల్సిందే. మరి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ కండల వీరుడు నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ హీరో. సహజంగా సినిమాల్లో చాలా ఎనర్జిటిక్ గా కనిపించే సల్మాన్.. బయట మాత్రం కాస్త గాంభీరంగా ఉంటారు. ఏదో రకంగా విమర్శలతో మీడియా కంట పడుతుంటారు. అది తన బిహేవియర్, కోపం కారణంగా సోషల్ మీడియాకు తరుచుగా చిక్కుతారు. ఈ మధ్యనే తన బాడీగార్డు వలన ఆయన పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమోగింది.

అయితే సల్మాన్ ఎక్కడ కూడా తన పరిధి మేరకే మాట్లాడతారు. ఇటివల గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ కి సల్మాన్ హాజరయ్యారు. అక్కడ ఓ బాలీవుడ్ లేడి సీనియర్ రిపోర్టర్ ని ఎలా ఉన్నారు.. అని పలకరిస్తూ తన నుదిటిపై ముద్దు పెట్టాడు. ఆ రిపోర్ట్ కూడా సల్మాన్ ని ఎంతో అప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన ఫ్యాన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి రిపోర్టర్ కు సల్మాన్ ముద్దుపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి