iDreamPost

Salaar: తెలుగులో ‘సలార్’ టికెట్స్​కు కౌంట్​డౌన్ స్టార్ట్! GO కూడా వచ్చేసింది!

  • Published Dec 19, 2023 | 5:23 PMUpdated Dec 19, 2023 | 6:25 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్​డేట్ వచ్చింది. ఈ మూవీకి తెలుగులో టికెట్లకు సంబంధించి కౌంట్​డౌన్ స్టార్ట్ అయిపోయింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్​డేట్ వచ్చింది. ఈ మూవీకి తెలుగులో టికెట్లకు సంబంధించి కౌంట్​డౌన్ స్టార్ట్ అయిపోయింది.

  • Published Dec 19, 2023 | 5:23 PMUpdated Dec 19, 2023 | 6:25 PM
Salaar: తెలుగులో ‘సలార్’ టికెట్స్​కు కౌంట్​డౌన్ స్టార్ట్! GO కూడా వచ్చేసింది!

ఈ ఏడాది పాన్ ఇండియా ఫ్యాన్స్ అందర్నీ ఎంతగానో ఊరిస్తూ వస్తున్న సినిమాల్లో ఒకటి ‘సలార్’. ఇప్పటికే ఒకసారి రిలీజ్​ను పోస్ట్​పోన్ చేసుకున్న ఈ మూవీ ఎట్టకేలకు బిగ్​స్క్రీన్స్​లోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. డార్లింగ్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్’ కోసం సౌత్​తో పాటు నార్త్​ ఆడియెన్స్ కూడా ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు. అయితే వాళ్లు మరో మూడ్రోజులు ఆగితే చాలు. ఫ్యాన్స్ ఎదురుచూపులకు డిసెంబర్ 22న ఫుల్​స్టాప్ పడనుంది. ప్రభాస్ కొత్త మూవీ అదే రోజున థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే యూఎస్​తో పాటు నార్త్ ఇండియాలోనూ చాలా చోట్ల ‘సలార్’ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే తెలుగు నాట టికెట్ల బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. తాజాగా దీనిపై అప్​డేట్ వచ్చేసింది. తెలుగులో ‘సలార్’ టికెట్స్​కు కౌంట్​డౌన్ మొదలైంది.

‘సలార్’ టికెట్స్​కు సంబంధించి ప్రభుత్వం నుంచి జీవో కూడా వచ్చేసింది. నైజాం ఏరియాలో ఈ సినిమా టికెట్లపై అఫీషియల్ క్లారిటీ వచ్చింది. ఇక్కడ సింగిల్ స్క్రీన్స్​లో టికెట్ ధరల్ని రూ.100, రూ.150, రూ.250గా నిర్ణయించారు. అదే మల్టీప్లెక్సుల్లో రూ.370, రూ.470గా డిసైడ్ చేశారు. సీటింగ్ క్లాస్​ను బట్టి ధరలు మారతాయి. అలాగే ఎక్స్​ట్రా షోస్ మీదా క్లారిటీ వచ్చేసింది. నైజాంలో రిలీజ్ డే నాడు 6 షోలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి ఒంటి గంట షోలకు కూడా సర్కారు అనుమతి ఇచ్చింది. కాగా నైజాం ఏరియా బుకింగ్స్ ఈరోజు రాత్రి 8.24 గంటలకు ఓపెన్ అవుతాయి. ఈ అప్​డేట్ తెలిసిన డార్లింగ్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. టికెట్ల కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఈ జోరు చూస్తుంటే బుకింగ్స్​లో కొత్త రికార్డులు సృష్టించేలా ఉన్నాడు ప్రభాస్.

‘సలార్’ టికెట్లకు నార్త్​లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉత్తరాదిన కూడా బజ్​ నెక్స్ట్ లెవల్లో ఉంది. ముంబైలోని కొన్ని థియేటర్ల వద్ద భారీగా ప్రభాస్ కటౌట్లు పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ నటించిన ‘డంకీ’ కూడా ఇదే వీకెండ్ రిలీజ్ కానుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య తీవ్ర పోటీ తప్పేలా లేదు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్​లో చాలా చోట్ల కింగ్ ఖాన్ మూవీని ప్రభాస్ ‘సలార్’ బీట్ చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ అయ్యాక బ్లాక్​బస్టర్ టాక్ వస్తే మాత్రం ఈ మూవీ దెబ్బకు ‘డంకీ’ నిలబడటం కష్టంగానే ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి.. ‘సలార్’ను బిగ్​స్క్రీన్స్​లో చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Netflix: నెట్‌ఫ్లిక్స్ సంచలన నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలే స్ట్రీమింగ్..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి