iDreamPost

రిలీజ్ ముందే రేర్ ఫీట్! ‘సలార్’ మాస్ ర్యాంపేజ్ లోడింగ్..

  • Author ajaykrishna Published - 12:48 PM, Tue - 18 July 23
  • Author ajaykrishna Published - 12:48 PM, Tue - 18 July 23
రిలీజ్ ముందే రేర్ ఫీట్! ‘సలార్’ మాస్ ర్యాంపేజ్ లోడింగ్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘సలార్’. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని కేజీఎఫ్, కాంతార ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ ఊహించని రేంజ్ లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సలార్ నుండి విడుదలైన టీజర్.. ఆద్యంతం సినిమాపై అంచనాలను పీక్స్ కి చేర్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా నెక్స్ట్ అప్డేట్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సలార్ రిలీజ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. దాని ప్రకారం.. సలార్ మూవీ ఇదివరకు ఏ ఇండియన్ సినిమా సాధించని రేర్ ఫీట్ అందుకుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ వివరాల్లోకి వెళ్తే.. సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న అన్ని భాషలలో విడుదల అవుతున్న విషయం విదితమే. అయితే.. ఓవర్సీస్ లో కేవలం నార్త్ అమెరికాలోనే సలార్ మూవీ ఏకంగా 1979 పైగా లొకేషన్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ విషయాన్నీ స్వయంగా సలార్ మూవీ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ తెలిపినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి ఇంతటి స్థాయిలో.. ఇన్ని లొకేషన్స్ లో రిలీజ్ దక్కలేదు. అంతేగాక.. రిలీజ్ ముందురోజు అంటే సెప్టెంబర్ 27న సలార్ ప్రీమియర్ షోస్ వేయనున్నట్లు సదరు డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ ఇచ్చారు. ప్రెజెంట్ ఈ న్యూస్ అటు ఇండస్ట్రీ వర్గాలలో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే సలార్ కి సంబంధించి ప్రతీ చిన్న విషయం ఇండస్ట్రీలో రచ్చ లేపుతోంది. నార్త్ అమెరికాలో 1979 లొకేషన్స్ పైగా సలార్ రిలీజ్ అని పోస్టర్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో 1979 అనే నెంబర్ పై ఫ్యాన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. 1979.. అనేది సలార్ హీరో ప్రభాస్ పుట్టిన సంవత్సరం.. కాబట్టి లొకేషన్స్ అలా లాక్ చేశారా? లేక.. సలార్ స్టోరీ 1979 టైమ్ లో జరుగుతుంది.. సో అలా అనుకున్నారా? అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సలార్ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ కాగా.. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సలార్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి