iDreamPost

Salaar: సలార్ లో పూనకాలు తెప్పించిన సీన్.. ఆ కాటేరమ్మ కథ ఇదే!

సలార్ సినిమా పేరు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. బాలీవుడ్ లో కూడా ప్రభాస్ క్రేజ్ హద్దులు దాటేస్తోంది.

సలార్ సినిమా పేరు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. బాలీవుడ్ లో కూడా ప్రభాస్ క్రేజ్ హద్దులు దాటేస్తోంది.

Salaar: సలార్ లో పూనకాలు తెప్పించిన సీన్.. ఆ కాటేరమ్మ కథ ఇదే!

స్పాయిలర్ అలర్ట్: సలార్ సినిమా ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ యాక్షన్- ప్రశాంత్ నీల్ ఎలివేషన్ కు అంతా మంత్ర ముగ్ధులైపోయారు. సినిమా మొత్తం ఒకెత్తైతే.. మూవీలో ఒక సీన్ మరొక ఎత్తు అని చెప్పాలి. వెనుక నుంచి వస్తున్న శత్రువులను బల్లెంతో పొడిచి.. ముందు నుంచి వస్తున్న వారిని కత్తులతో చీల్చేస్తాడు. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది.. “కాటేరమ్మ రాలేదు గానీ.. కొడుకుని పంపింది” ఆ మాట పూర్తవగానే వెనుక పది చేతుల్లో కత్తులతో అపరకాళి అవతారంలో ప్రభాస్ దర్శనం ఉంటుంది. ఆ సీన్ ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో థియేటర్లో కూర్చొని చూస్తుంటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. అలాంటి హైఓల్టేజ్ సీన్లో చెప్పుకున్నా కాటేరమ్మ కథేంటో మీకు తెలుసా? తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదివేయండి.

ఆవిడ పేరు కాటేరీ దేవత. ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి.. కొన్ని వందల ఏళ్లుగా హిందూ ఆరాధ్య దైవంగా ఉంది. ఈవిడను పార్వతీ దేవి అవతారంగా చెబుతారు. అందుకు సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. రోజూ కైలాసంలో శివుడు నిద్రపోయిన తర్వాత పార్వతీ దేవీ ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్లేదట. మళ్లీ తిరిగి సూర్యోదయానికి ముందే కైలాసం చేరుకునేది. కొన్ని రోజులకు ఈ విషయం శివడికి కూడా తెలిసింది. అలా రాత్రులు బయటకు వెళ్లడంపై శివుడు ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. ఓరోజు రాత్రి కైలాసం అడవుల గుండా పార్వతీదేవి బయటకు వెళ్లిన సమయంలో శివుడు కూడా అనుసరిస్తాడు. అప్పుడు పార్వతీ దేవి పూడ్చిపెట్టిన శవాలను తవ్వి తినబోయే ప్రయత్నం చేస్తుందంట. అలా ఉగ్రరూపం దాల్చి ఉన్న పార్వతీదేవిని నిలువరించేందుకు శివడు ఒక పెద్ద గోయ్యిని ఏర్పాటు చేస్తాడు. భద్రకాళి రూపంలో ఉన్న పార్వతీ దేవి ఆ గోయిలో పడిపోతుంది.

Punakale for this scene in Salar

 

తాను చేస్తున్న పనుల విషయంలో పశ్చాతాపం చెందుతుంది. ఇకపై అలా చేయనని శివుడికి మాటివ్వడమే కాకుండా.. ఆ రూపాన్ని ఆ గోతిలోనే వదిలేస్తుందట. ఆ రూపాన్నే కాటేరీ దేవతగా పిలుస్తారని జానపద కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ కాటేరీ దేవతను నమ్ముకున్న వారి కోర్కేలు తీర్చే ఇష్టదైవంగా, రోగాలను నయం చేసే శక్తిరూపంలో వందల ఏళ్ల నుంచి భక్తుల నుంచి పూజలు అందుకుంటోంది. ఈ దేవత నమ్ముకున్న వారికి అండగా ఉంటుందని చెబుతారు. ఈ శక్తిరూపాన్ని దుష్ట సహారం చేసే దేవతగా పిలుస్తారు. మరీ ముఖ్యంగా సౌత్ లో ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. కర్ణాటకలో అయితే కాటేరమ్మగా, తమిళనాడులో కాటేరీ అమ్మన్ గా కొలుస్తారు. ఈ అమ్మవారు కేవలం ఉగ్రరూపంలోనే కాకుండా శాంతి స్వరూపిణిగా కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఉగ్రంగా ఉండే రూపాన్ని చేతుల్లో ఆయుధాలతో తయారు చేస్తారు. శాంతి స్వరూపిణిగా ఉండే రూపాన్ని మాత్రం ఎక్కువగా నాలుగు భుజాలతో రూపొందిస్తారు.

Punakale for this scene in Salar

చేతుల్లో కత్తి, త్రిశూలం, గిన్నె, తామర ఉంటాయి. విగ్రహాలు నలుపు, నీలి రంగుల్లో ఉంటాయి. ఒక్క భారతదేశంలోనే కాకుండా.. శ్రీలంకలో ఈ అమ్మవారు పూజలు అందుకుంటోంది. అంతేకాకుండా.. సౌత్ ఆఫ్రికా, మారిషస్, ట్రినిడాడ్, జమైకా, గునయాల్లో స్థిరపడిన తమిళ ప్రజలు కూడా ఈ కాటేరమ్మను కొలుస్తూ ఉంటారు. ఈవిడ కొన్నిచోట్ల ఇష్టదైవంగా, మరికొన్ని చోట్ల గ్రామదేవతగా, ఇంకొన్నిచోట్ల పొలిమేర కాపలాకాసే అమ్మవారిగా పూజలు అందుకుంటోంది. కొందరు ప్రజలు ఈవిడను బలి దేవతగా కూడా పూజిస్తూ ఉంటారు. కర్ణాటక, తమిళనాడుల్లోని దళిత కమ్యునిటీల్లో ఈవిడకు బలిదానాలు ఇస్తుంటారు. కోళ్లు, మేకలే కాకుండా కొన్నిసార్లు పందులను కూడా బలిస్తుంటారు. మద్రాసీ సంస్కృతిలో అయితే.. ఈ అమ్మవారికి మద్యం, సిగిరెట్లు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇదండీ సలార్ సినిమాలో చెప్పిన కాటేరమ్మ అమ్మవారి కథ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి