iDreamPost

Salaar: షారుఖ్‌ను వెనక్కు నెట్టిన ప్రభాస్‌.. అక్కడ కలెక్షన్ల వేట!

సలార్‌, డంకీ సినిమాలు ఓ రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి నుంచి డంకీని సలార్‌కు పోటీ అని అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే, డంకీ పోటీ కాదని తేలిపోయింది.

సలార్‌, డంకీ సినిమాలు ఓ రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి నుంచి డంకీని సలార్‌కు పోటీ అని అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే, డంకీ పోటీ కాదని తేలిపోయింది.

Salaar: షారుఖ్‌ను వెనక్కు నెట్టిన ప్రభాస్‌.. అక్కడ కలెక్షన్ల వేట!

ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్‌’ సరి కొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రత్యర్థి సినిమాను మట్టి కరిపించేసింది. ఓవర్‌సీస్‌ కలెక్షన్ల విషయంలో డంకీని సలార్‌ గట్టి దెబ్బ కొట్టింది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ను ప్రభాస్‌ వెనక్కు నెట్టేశారు. షారుఖ్‌ను ఓవర్‌సీస్‌ కింగ్‌ అని అంటూ ఉంటారు.

ఆయన చిత్రాలకు ఓవర్‌సీస్‌ మంచి కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అయితే, డంకీ విషయంలో మాత్రం సలార్‌ గట్టి దెబ్బ కొట్టింది. షారుఖ్‌ ఓవర్‌ సీస్‌ రికార్డులను ప్రభాస్‌ కొల్లగొట్టేశారు. ఓవర్‌సీస్‌లోని చాలా దేశాల్లో కోట్ల రూపాయల బిజినెస్‌ చేశాడు. ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్‌ చేశాడు. ఓవర్‌సీస్‌లో సలార్‌ మొదటి వారం కలెక్షన్ల వివరాలు..

  • నార్త్‌ అమెరికా – 46 కోట్ల రూపాయలు
  • యూఏఈ – 9.73 కోట్ల రూపాయలు
  • రెస్ట్‌ ఆఫ్‌ జీసీసీ – 7.24 కోట్ల రూపాయలు
  • యూకే అండ్‌ ఐర్లాండ్‌ – 4.17 కోట్ల రూపాయలు
  • ఆస్ట్రేలియా – 4.9 కోట్ల రూపాయలు
  • సింగపూర్‌ – 1.18 కోట్ల రూపాయలు
  • న్యూజిలాండ్‌ – 41.5 లక్షలు
  • యూరప్‌, ఎమ్‌వై, ఎపీ, ఎస్‌ఎల్‌, ఆర్‌ఓడబ్ల్యూ – 5.82 కోట్ల రూపాయలు

ఇక, ప్రపంచ వ్యాప్తంగా సలార్‌ సినిమా మూడు రోజుల్లో 375 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. మొదటి రోజు 178 కోట్ల రూపాయలు.. రెండవ రోజు 120 కోట్ల రూపాయలు.. మూడవ రోజు 80 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే 400 కోట్లకు చేరువగా వచ్చింది. ఇక, నాలుగవ రోజు కూడా సలార్‌ తన సత్తా చాటింది. 46 కోట్ల రూపాయల్ని కలెక్ట్‌ చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సలార్‌ నాలుగు రోజుల కలెక్షన్‌ దాదాపు 420 కోట్లక రూపాయలకు చేరింది.

కాగా, షారుఖ్‌ ఖాన్‌ – రాజ్‌ కుమార్‌ హిరానీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ డంకీ’.. సలార్‌కు గట్టి పోటీ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే, అలా జరగలేదు. డంకీ, సలార్‌లు ఒక రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సలార్‌ దెబ్బకు డంకీ పోటీలో లేకుండా పోయింది. డంకీ మూడు రోజుల్లో కేవలం 215 కోట్ల రూపాయల కలెక్షన్లకు మాత్రమే పరిమితం అయింది. సలార్‌ మాత్రం దూసుకుపోతోంది. నార్త్‌లో మాత్రం సలార్‌ కంటే డంకీకి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి.

ఇందుకు కారణాలు లేకపోలేదు. నార్త్‌లో షారుఖ్‌ క్రేజ్‌.. థియేటర్ల విషయంలో సలార్‌తో పోలిస్తే.. డంకీకి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. ఇది నార్త్‌లో సలార్‌ కలెక్షన్లపై బాగా ప్రభావం చూపింది. అయినప్పటికి ప్రపంచ వ్యాప్త కలెక్షన్లలో సలార్‌ ది బెస్ట్‌ అనిపించుకుంటోంది. మరి, ఓవర్‌సీస్‌లో సత్తా చాటుతున్న ప్రభాస్‌ మూవీ సలార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి