iDreamPost

సారీ చెప్తూనే తన వ్యాఖ్యలని సమర్ధించుకున్న సాయి పల్లవి..

సారీ చెప్తూనే తన వ్యాఖ్యలని సమర్ధించుకున్న సాయి పల్లవి..

ఇటీవల విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశాను. అందులో కాశ్మీర్ పండిట్స్ ని చంపడం, ఆవుల్ని తీసుకెళ్తున్న ఓ ముస్లిం లారీ డ్రైవర్‌పై దాడి చేయడం రెండూ ఒకటే అంటూ వ్యాఖ్యలు చేసింది.

దీంతో సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. ఉగ్రవాదులతో కలిసి కొందరు మతం మారకపోతే చంపేసిన సంఘటనలని, దైవంలా కొలిచే ఆవుల్ని చంపడానికి తీసుకెళ్తుంటే కొట్టిన సంఘటనని ఎలా ఒకటి అంటావు అంటూ సాయి పల్లవిపై విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. పలువురు ప్రముఖులు సైతం ఆమె వ్యాఖ్యలని తప్పు పట్టారు. పలుచోట్ల సాయిపల్లవిపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో సాయి పల్లవి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచింది.

తాజాగా సాయి పల్లవి తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సాయి పల్లవి మాట్లాడుతూ.. ఇటీవల నేను అన్న మాటలు కొంతమందిని బాధపెట్టినందుకు సారీ. కానీ ఒక డాక్టర్‌గా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. అది ఎవరైనా, ఏ మతంలోనైనా. నేను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా పూర్తి ఇంటర్వ్యూ చూడకుండా కేవలం ఆ మాటలనే ప్రమోట్ చేశారు. నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పే. నేను శాంతికి ప్రాధాన్యం ఇస్తాను అని తెలిపింది. మరి సాయి పల్లవి ఇచ్చిన వివరణతో వివాదం సద్దుమణుగుతుందా లేదా చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి