iDreamPost

Sainikudu , Varudu : స్టార్ పవర్ కాదు సరుకు ఉండాలి – Nostalgia

Sainikudu , Varudu : స్టార్ పవర్ కాదు సరుకు ఉండాలి – Nostalgia

స్టార్ ఇమేజ్ ఉన్న హీరో దొరికాడు. ఎన్ని కోట్లయినా పర్లేదు ఖర్చు రెడీ అనే నిర్మాత ముందుకు వచ్చాడు. కాల్ షీట్లు వచ్చేశాయి. టాప్ మోస్ట్ టెక్నీషియన్లు రంగంలోకి దిగారు. ఒక బ్లాక్ బస్టర్ సాదించేందుకు ఇవి సరిపోతాయా. ఖచ్చితంగా కాదు. అసలైన కథ ఉండాలిగా. పైవన్నీ పెట్టి తోచింది తీస్తే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పి కొడతారని చరిత్ర చాలా సార్లు ఋజువు చేసింది. ఉదాహరణ చూద్దాం. 2003 ‘ఒక్కడు’ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు గుణశేఖర్ మహేష్ బాబు కాంబినేషన్ ని రిపీట్ చేసిన ‘అర్జున్’ అంత మేజిక్ చేయలేకపోయింది. భారీతనంతో పాటు అన్నీ ఉన్నా అంచనాలు సగం మాత్రమే అందుకోగలిగింది. కానీ ప్రిన్స్ గురి మారలేదు.

హ్యాట్రిక్ సినిమాతో మరోసారి మేజిక్ చేయగలమన్న నమ్మకంతో గుణశేఖర్ కి వరసగా మూడో అవకాశం ఇచ్చారు మహేష్. ఈసారి వైజయంతి బ్యానర్ తో అశ్వినీదత్ తోడయ్యారు. టైటిల్ ‘సైనికుడు’. హరీష్ జైరాజ్ సంగీతం. బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ విలన్. త్రిష హీరోయిన్. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్లు ఉండనే ఉన్నారు. ఇంకేముంది బ్లాక్ బస్టర్ ఫిక్స్ అనుకున్నారు ఫ్యాన్స్. కోట్ల రూపాయల బడ్జెట్ మంచి నీళ్లలా ఖర్చయ్యింది. అంతా బాగానే ఉంది కానీ స్క్రిప్ట్ విషయంలోనే తేడా కొట్టేసింది. ఫస్ట్ హాఫ్ లో విలన్ ని హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడటం జనానికి నచ్చలేదు. యాక్షన్ ని సరిగా సెట్ చేయలేదు.

సోషల్ మెసేజ్ కి యాక్షన్ ఫ్లేవర్ ఇద్దామని ప్రయత్నించిన గుణశేఖర్ కు పరుచూరి సోదరుల కలం, చక్కని సంగీతం బలం కాలేకపోయింది. ఫలితంగా 2006లో వచ్చిన సైనికుడు దారుణమైన డిజాస్టర్. కట్ చేస్తే నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ కు ఈసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తోడయ్యారు. ఈసారీ పొరపాటు రిపీట్ అయ్యింది. రోజుల తరబడి జరిగే సాంప్రదాయక పెళ్లికి కమర్షియల్ టచ్ ఇస్తూ తమిళం నుంచి ఆర్యని విలన్ గా తీసుకొచ్చి చేసిన ‘వరుడు’ని అభిమానులే భరించలేకపోయారు. దీంతో 2010లో రిలీజైన వరుడుకి సైతం డిజాస్టర్ రుచి తప్పలేదు. ఓవర్ ఎమోషన్స్, అర్థం లేని సెంటిమెంట్, హద్దులు దాటిన విలనిజం. ఏ మాత్రం ఆకర్షణ లేని హీరోయిన్ మొత్తంగా కలిసి వరుడిని ముంచేశాయి. దెబ్బకు ఒక్కడు తో వచ్చిన ఇమేజ్ ని గుణశేఖర్ నిలబెట్టుకోలేకపోయారు

Also Read : ప్రేమనగర్ కాంబోలో మరో క్లాసిక్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి