iDreamPost

Movie CD’s : ఓటిటిలు లేని రోజుల్లో హోమ్ సినిమా

మొదట్లో వీటి రేట్ చాలా ఎక్కువ ఉండేవి. ఏ సినిమా అయినా కనీసం 200 రూపాయలు. సుప్రీమ్, మోసర్ బేర్ కంపెనీలు వచ్చి ఏకంగా వీటి రేట్లను 50 రూపాయలకు దిగి వచ్చేలా చేశాయి. ఇలా చేయడం వల్ల రెంటల్ మార్కెట్ బాగా దెబ్బ తింది. ఏదైనా సిడి/డివిడి మీద స్క్రాచ్ పడిందా గోవిందా. మంచి సీనో పాటో వచ్చినప్పుడు కచ్ కచ్ అంటూ స్ట్రక్ అయిపోయి గుండెల్లో మెలితిప్పినట్టు అయ్యేది.

మొదట్లో వీటి రేట్ చాలా ఎక్కువ ఉండేవి. ఏ సినిమా అయినా కనీసం 200 రూపాయలు. సుప్రీమ్, మోసర్ బేర్ కంపెనీలు వచ్చి ఏకంగా వీటి రేట్లను 50 రూపాయలకు దిగి వచ్చేలా చేశాయి. ఇలా చేయడం వల్ల రెంటల్ మార్కెట్ బాగా దెబ్బ తింది. ఏదైనా సిడి/డివిడి మీద స్క్రాచ్ పడిందా గోవిందా. మంచి సీనో పాటో వచ్చినప్పుడు కచ్ కచ్ అంటూ స్ట్రక్ అయిపోయి గుండెల్లో మెలితిప్పినట్టు అయ్యేది.

Movie CD’s : ఓటిటిలు లేని రోజుల్లో హోమ్ సినిమా

అద్దాలు పేర్చిన ర్యాక్స్ లో సిడిలు డివిడిలు నీట్ గా సర్దిపెట్టి వచ్చినోళ్లందరికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా బిల్డప్ ఇస్తున్న షాప్ వాడిని పైన ప్రశ్న అడిగినట్టు ఉన్నా నిజానికి నేను బ్రతిమాలాను. సినిమా వచ్చి వంద రోజులు దాటేసింది. కానీ ఒక్కడు ఇంట్లో కూర్చుని రిపీట్ రన్లు వేసుకోవాలన్న కోరిక పెరిగే కొద్దీ ఒరిజినల్ సిడి రావడం అంతకంతా లేట్ అవుతూనే ఉంది. అప్పుడు ప్రైమ్ లాంటి ఓటిటిలు లేవు. స్ట్రీమింగ్ టైం చెక్ చేసుకుని స్మార్ట్ ఫోన్ లో చూసుకోవడానికి. శాటిలైట్ ఛానల్స్ లో ప్రీమియర్ రావాలంటే ఏడాది పట్టేది. అందుకే ఇవే దిక్కుగా ఉండేవి. కాస్త పాకెట్ మనీ ఎక్కువ ఉంటే స్వంతానికి కొనేసుకుని పెట్టుకోవడం. లేదూ ఫ్లాప్ సినిమా అయితే దాన్ని బాడుగ తెచ్చుకుని ఓ రెండు మూడు షోలు వేసి 20 రూపాయలు అద్దె పడేసి రిటర్న్ ఇచ్చి రావడం. ఇలా ఉండేవి ఈ సిడిల ముచ్చట్లు.

మొదట్లో వీటి రేట్ చాలా ఎక్కువ ఉండేవి. ఏ సినిమా అయినా కనీసం 200 రూపాయలు. సుప్రీమ్, మోసర్ బేర్ కంపెనీలు వచ్చి ఏకంగా వీటి రేట్లను 50 రూపాయలకు దిగి వచ్చేలా చేశాయి. ఇలా చేయడం వల్ల రెంటల్ మార్కెట్ బాగా దెబ్బ తింది. ఏదైనా సిడి/డివిడి మీద స్క్రాచ్ పడిందా గోవిందా. మంచి సీనో పాటో వచ్చినప్పుడు కచ్ కచ్ అంటూ స్ట్రక్ అయిపోయి గుండెల్లో మెలితిప్పినట్టు అయ్యేది. మళ్లీ ఇంకో కాపీ కొనాల్సిందే. అలా కొని కొని ఇంట్లో సీడీలతో గూళ్ళు నిండిపోయిన నా లాంటి సినిమా పిచ్చోళ్ళు వీధికో పది మంది ఈజీగా ఉండేవాళ్ళు. వీటిని చూస్తూ ఇంట్లో అమ్మానాన్న తిట్ల దండకం గురించి చెప్పేదేముంది. కాకపోతే ఇవి ఎంత ఒరిజినల్ అయినా ఇప్పుడులా HD క్లారిటీ ఉండేది కాదు. బొమ్మ నీట్ గా ఉంటే అదే గొప్ప.

అప్పట్లో అలా కొనేసి దాచుకున్న సిడిలను రోజుకోసారి బయటికి తీసి చేత్తో నిమురుతూ చూసుకుంటే అదో ఆనందం. ఆ సినిమానే నా సొంతమైన ఫీలింగ్. జీవితాంతం ఫ్రీగా చూసుకోవచ్చన్న నిశ్చింత. ఒక్కడే కాదు బ్లాక్ అండ్ వైట్ గుండమ్మ కథ నుంచి మెగా బ్లాక్ బస్టర్ ఇంద్ర దాకా చాలా కలెక్షన్ ఉండేది నా దగ్గర. వాటికి పెట్టిన డబ్బుని బ్యాంకులో దాచుకుని ఉంటే ఇప్పుడు మా సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఓ ఫ్లాట్ కొనేంత సొమ్ము పొగయ్యేది. సినిమా మైకం ముందు పొదుపు అనే మాటకు చోటుండదు. డివిడి ప్లేయర్ రిపేర్ కు వస్తే అది బాగయ్యే వరకు అదో నరకం. 4జి నెట్, టీబీల కొద్ది హార్డ్ డిస్కులు, 4K క్వాలిటీతో స్టన్నింగ్ రెజొల్యూషన్, నానా రకాల ఓటిటిలు లేని రోజుల్లో ఈ సిడిలదే రాజ్యం. వాటికి నాలాంటి వాళ్లే చక్రవర్తులు. ఇప్పుడివి కనుమరుగైపోయాయి కానీ మనసు జ్ఞాపకాల్లో అప్పుడప్పుడు ప్లే అవుతూనే ఉంటాయి. కాకపోతే మర్చిపోలేం కాబట్టి స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉండదు. రీప్లేలకు కరెంటుతో పని పడదు. అందుకే ఈ మెమరీస్ శాశ్వతం. రెన్యూవల్ అవసరమే లేదు.

Also Read : Nirnayam : మేజిక్ చేయలేకపోయిన మలయాళం రీమేక్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి