iDreamPost

ఒకే రోజు డబుల్‌ సెంచరీలతో చరిత్ర సృష్టించిన ముగ్గురు మొనగాళ్లు!

  • Published Feb 24, 2024 | 12:30 PMUpdated Feb 24, 2024 | 12:30 PM

Sachin Tendulkar, MS Dhoni, Chris Gayle: క్రికెట్‌లో రికార్డులు సర్వసాధారణం.. కానీ, కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండిపోతాయి. అలాంటి రికార్డులను సచిన్‌, ధోని , గేల్‌ సృష్టించారు. అది కూడా ఒకే రోజు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

Sachin Tendulkar, MS Dhoni, Chris Gayle: క్రికెట్‌లో రికార్డులు సర్వసాధారణం.. కానీ, కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండిపోతాయి. అలాంటి రికార్డులను సచిన్‌, ధోని , గేల్‌ సృష్టించారు. అది కూడా ఒకే రోజు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

  • Published Feb 24, 2024 | 12:30 PMUpdated Feb 24, 2024 | 12:30 PM
ఒకే రోజు డబుల్‌ సెంచరీలతో చరిత్ర సృష్టించిన ముగ్గురు మొనగాళ్లు!

క్రికెట్‌లో కొన్ని రికార్డులు పదిలంగా నిలిచిపోతాయి. వాటిని తర్వాతి తరం ఆటగాళ్లు బ్రేక్‌ చేసినా కూడా మొట్టమొదటి సారి చరిత్ర సృష్టిస్తూ ఆటగాళ్లు ఆడిన ఇన్నింగ్స్‌లు చరిత్రలో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి ఇన్నింగ్సుల్లో ఒకటి సచిన్‌ టెండూల్కర్‌ డబుల్‌ సెంచరీ. 2010లో సచిన్‌ సౌతాఫ్రికాపై గ్వాలియర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ డబుల్ సెంచరీ సాధించాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అదే మొట్టమొదటి డబుల్‌ సెంచరీ. 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సులతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా సచిన్‌ అరుదైన ఘనత సాధించాడు. ఆ తర్వాత చాలా మంది వన్డేల్లో డబుల్‌ సెంచరీ బాదినా.. సచిన్‌ డబుల్‌ సెంచరీ మాత్రం అలా చరిత్రలో నిలిచిపోయింది.

అలాగే టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సైతం ఇదే రోజు అంటే.. 2013 ఫిబ్రవరి 24న డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. అయితే అది వన్డేల్లో కాదు టెస్టుల్లో. చెన్నై వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో ధోని డబుల్‌ సెంచరీ మార్క​్‌ అందుకున్నాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 265 బంతుల్లో 24 ఫోర్లు, 6 సిక్సులతో 224 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి వికెట్‌ కీపర్‌ కమ్‌ కెప్టెన్‌ ధోనినే, ఇంకా ఆ రికార్డ్‌ పదిలంగానే ఉంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.

ఫిబ్రవరి 24వ తేదీనే డబుల్‌ సెంచరీ చేసిన మరో ప్లేయర్‌ క్రిస్‌ గేల్‌. యూనివర్సల్‌ బాల్‌గా పేరు తెచ్చుకున్న ఈ వెస్టిండీస్‌ దిగ్గజ మాజీ క్రికెటర్‌ విధ్వంసానికి మారుపేరు. 2015 వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 24న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ ఏకంగా 215 పరుగులతో చెలరేగాడు. 147 బంతుల్లోనే 10 ఫోర్లు, 16 సిక్సులతో 215 పరుగులతో సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. వెస్టిండీస్‌ తరఫున వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా, అలాగే వన్డే వరల్డ్‌ కప్‌లో డబుల్‌ సెంచరీ చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా క్రిస్‌ గేల్‌ చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలా సచిన్‌ టెండూల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోని, క్రిస్‌ గేల్‌.. ఫిబ్రవరి 24వ తేదీలోనే డబుల్‌ సెంచరీలతో కొత్త చరిత్ర లిఖించారు. అందుకే ఫిబ్రవరి 24ను ది డే ఆఫ్‌ డబుల్‌ సెంచరీస్‌గా చెప్పుకుంటారు. మరి సచిన్‌, ధోని, గేల్‌ డబుల్‌ సెంచరీలతో పాటు ఈ రోజు డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి