iDreamPost

Jason Roy: వీడియో: జేసన్ రాయ్ భారీ సిక్స్.. బాల్ ఎక్కడపడిందో తెలుసా? బిక్కమెుఖం వేసిన రబాడ!

ఎస్ఏ20 లీగ్ లో శుక్రవారం న్యూలాండ్స్ వేదికగా MI కేప్ టౌన్ వర్సెస్ పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు జేసన్ రాయ్.

ఎస్ఏ20 లీగ్ లో శుక్రవారం న్యూలాండ్స్ వేదికగా MI కేప్ టౌన్ వర్సెస్ పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు జేసన్ రాయ్.

Jason Roy: వీడియో: జేసన్ రాయ్ భారీ సిక్స్.. బాల్ ఎక్కడపడిందో తెలుసా? బిక్కమెుఖం వేసిన రబాడ!

జేసన్ రాయ్.. విధ్వంసానికి పెట్టిన మరో పేరు ఈ ఇంగ్లాండ్ క్రికెటర్. ఫోర్లు, సిక్స్ లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడంలో దిట్ట రాయ్. అలవోకగా సిక్స్ లు బాదడంలో నైపుణ్యం గలవాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఏ20 లీగ్ లో పార్ల్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం న్యూలాండ్స్ వేదికగా MI కేప్ టౌన్ వర్సెస్ పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు జేసన్ రాయ్. మరీ ముఖ్యంగా సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడను చీల్చి చెండాడాడు రాయ్. ఇక రాయ్ ఈ మ్యాచ్ లో ఓ భారీ సిక్స్ కొట్టాడు. దాంతో బిక్కమెుఖం వేశాడు రబాడ.

ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ లో బ్యాటర్లు చెలరేగుతున్నారు. బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. ఎడాపెడా బౌండరీలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇక శుక్రవారం(జనవరి 19)న న్యూలాండ్స్ వేదికగా ఎంఐ కేప్ టౌన్ వర్సెస్ పార్ల్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాడు జేసన్ రాయ్ చిన్నపాటి విధ్వంసాన్నే సృష్టించాడు. ఎంఐ కేప్ టౌన్ టీమ్ స్టార్ పేసర్ కగిసో రబాడాను టార్గెట్ చేసుకుని దంచికొట్టాడు. 13 బంతుల్లో 5 సిక్స్ లు ఓ ఫోర్ తో 38 పరుగులు చేయగా.. ఈ 5 సిక్స్ లు, ఫోరు కూడా రబాడా బౌలింగ్ లోనే కొట్టడం విశేషం.

ఇది కాసేపు పక్కనపెడితే.. రాయ్ అవుట్ అయ్యే ముందు రబాడ బౌలింగ్ లో ఓ భారీ సిక్స్ కొట్టాడు. అతడు కొట్టిన షాక్ కు ఆ బాల్ నేరుగా వెళ్లి గ్రౌండ్ అవతలపడింది. దీంతో గ్రౌండ్ లో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సిక్స్ చూసిన రబాడా బిక్క మెుఖం వేశాడు. ప్రస్తుతం ఈ సిక్స్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏం తింటావ్ బ్రో ఇలా కొట్టావ్.. పాపం ఆ బౌలర్ చూడు ఎలా అయ్యాడో అని కొందరు కామెంట్ చేశారు. ఇక ఇతడు వేసిన తొలి ఓవర్ లో ఏకంగా 3 సిక్స్ లు, ఓ ఫోర్ బాది చుక్కలు చూపాడు జేసన్ రాయ్. మ్యాచ్ విషయానికి వస్తే.. లుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ టీమ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. మరి రాయ్ కొట్టిన భారీ సిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి