iDreamPost

అమెరికాకు రష్యా భారీ షాక్.. ఐఫోన్లు బ్యాన్!

  • Author Soma Sekhar Published - 05:21 PM, Fri - 14 July 23
  • Author Soma Sekhar Published - 05:21 PM, Fri - 14 July 23
అమెరికాకు రష్యా భారీ షాక్.. ఐఫోన్లు బ్యాన్!

అమెరికాకు చెందిన ఆపిల్ ఫోన్లను, ఆ కంపెనీకి సంబంధించిన ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించరాదని ప్రభుత్వం అధికారులకు గతంలోనే ఆదేశాలు జారీచేసింది రష్యా ప్రభుత్వం. అయితే ఈ ఆదేశాలు ప్రారంభంలో ఆప్టో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో ప్రత్యేకత కలిగిన రోస్టెక్ అనుబంధ సంస్థల్లో ఒకటైన ష్వాబేపై మాత్రమే నిషేధం ఉంటుందని అప్పట్లో తెలిపింది. తాజాగా ఈ నిషేధాన్ని మరిన్ని ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలకు విస్తరించింది రష్యా ప్రభుత్వం. దాంతో అమెరికాకు భారీ షాక్ తగలనుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో జరిగిన పరిణామాల దృష్ట్యా రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. అదీకాక అమెరికా గూఢా చారులు రష్యా రక్షణ అధికారులు వాడే ఐఫోన్లలో CIA మాల్వేర్ ను అమర్చిందని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(FSB) ఆరోపించింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని రక్షణ-సైనిక, పారిశ్రామిక సమ్మేళనాలతో పాటుగా మరికొన్ని ప్రభుత్వం కార్పోరేషన్ లో ఐఫోన్లను వాడటం నిషేధించింది. ఇందుకు సంబంధంచిన ఉత్తర్వులను జారీ చేసింది. రష్యా రక్షణ సంస్థ రోస్టెక్ టాస్ వార్త పత్రికకు ఇందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం రష్యా విధించిన నిషేధం కార్పోరేషన్ లోని అన్ని సంస్థలకు వర్తిస్తుంది. ప్రారంభంలో కొన్ని సంస్థల వరకే అమెరికా ఐఫోన్ల వాడకంపై నిషేధం విధించారు. కానీ రష్యా పౌరులు, దేశంలోని విదేశీ దైత్యవేత్తలు ఉపయోగించే అనేక ఐఫోన్లలో CIA మాల్వేర్ ను అమర్చిందని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ కొనుక్కుంది. దాంతో తమకు సంబంధించిన రక్షణ రహస్యాలు బహిర్గతం కాకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు రష్యా రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. రష్యా తీసుకున్నఈ నిర్ణయంతో.. అమెరికాకు భారీ షాక్ తగలనుంది.

ఇదికూడా చదవండి: తెలంగాణ బీజేపీ నేత కిడ్నాప్‌.. ఆందోళనలో కుటుంబసభ్యులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి