iDreamPost

టాలీవుడ్ ఎంట్రీపై ఈ గందరగోళం దేనికి..?

  • Author ajaykrishna Published - 08:05 AM, Sat - 23 September 23
  • Author ajaykrishna Published - 08:05 AM, Sat - 23 September 23
టాలీవుడ్ ఎంట్రీపై ఈ గందరగోళం దేనికి..?

సూర్య.. పేరుకు తమిళ స్టార్ హీరో అయినప్పటికీ, తెలుగులోను భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిఉన్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై ఏళ్లుగా సూర్య ఎలాంటి సినిమా చేసినా.. తెలుగులో డబ్ చేసి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. సూర్య సినిమాలకు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో.. తెలుగు రాష్ట్రాలలో కూడా అంతే రేంజ్ క్రేజ్ ఉంది. అయితే.. కొన్నాళ్ళుగా సూర్యని స్ట్రెయిట్ తెలుగు సినిమాలో చూడాలని ఇక్కడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ.. చాలా కాలంగా ఈ కోరిక వాయిదా పడుతూ వస్తోంది. కొద్దిరోజులు ఓ డైరెక్టర్ తో ఫిక్స్ అని.. మరికొన్ని రోజులు ఇంకో డైరెక్టర్ అంటూ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. కానీ.. ఎందులోనూ నిజం లేదని అర్థమైంది.

సూర్య తెలుగు ప్రేక్షకులకు సాఫ్ట్ రోల్స్ కంటే ఊరమాస్ క్యారెక్టర్స్ తో ఎక్కువగా కనెక్ట్ అయిపోయాడు. గజినీ, సింగం సిరీస్ లతో జనాల గుండెల్లో నిలిచిపోయాడు. స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తే సూర్యని అలా చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆ మధ్య దర్శకుడు త్రివిక్రమ్ తో సూర్య సినిమా అన్నారు. కానీ.. అది నిజం కాదని తెలియడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఆల్రెడీ సూర్య రామ్ గోపాల్ వర్మతో రక్తచరిత్ర సినిమాలో చేశాడు. కాకపోతే అందులో సూర్య హీరో కాదు. అది ఫుల్ లెన్త్ రోల్ కూడా కాదు. దీంతో ఇప్పుడు సూర్య లీడ్ హీరోగా మరో టాలీవుడ్ డైరెక్టర్ తో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆ వివరాల్లోకి వెళ్తే.. సూర్య ప్రస్తుతం కంగువ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత సుధా కొంగర, వెట్రిమారన్ లతో సినిమాలు లైనప్ చేశాడు. వీటి తర్వాత తెలుగు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నట్లు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో గానీ.. బోయపాటితో సినిమా అంటే ఓ విధంగా ఊరమాస్ అనిపించినా, రిస్క్ కూడా అంతే అని అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే.. నటసింహం బాలయ్యను డీల్ చేసినట్లుగా.. ఈ మధ్యకాలంలో వేరే హీరోలతో బోయపాటికి పెద్ద ట్రాక్ రికార్డు లేదు. బోయపాటి మాస్ ట్రీట్మెంట్ అంతా బాలయ్యకు సెట్ అయినట్లు ఎవరికీ సెట్ కాలేదు. కానీ.. ఇప్పుడు రామ్ తో స్కంద చేశాడు. సెప్టెంబర్ 28న స్కంద రిలీజ్ అవుతోంది. ఆ సినిమా ఫలితం బట్టి.. బోయపాటికి సూర్య సైడ్ నుండి సానుకూలత కనిపించే అవకాశం ఉందేమో చూడాలని ఫ్యాన్స్ టాక్. మరి సూర్య, బోయపాటి కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి