iDreamPost
android-app
ios-app

Babloo Prithiveeraj : పెళ్లైన ఏడాదికే రెండో భార్యకు విడాకులు..? అందుకే ఆ పని చేశారా..

  • Published Dec 01, 2023 | 3:43 PM Updated Updated Dec 01, 2023 | 3:43 PM

యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన నటుడు పృథ్వీరాజ్.. తన రెండో భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన నటుడు పృథ్వీరాజ్.. తన రెండో భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published Dec 01, 2023 | 3:43 PMUpdated Dec 01, 2023 | 3:43 PM
Babloo Prithiveeraj : పెళ్లైన ఏడాదికే రెండో భార్యకు విడాకులు..? అందుకే ఆ పని చేశారా..

ఈమధ్య కాలంలో మన సమాజంలో విడాకుల అంశాన్ని ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. నచ్చితే పెళ్లి చేసుకోవడానికి ఎంత తొందరపడుతున్నారో.. తేడా వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి, విడిపోవడం వంటి విషయాల్లో చాలా కేర్ ఫ్రీగా ఉంటున్నారు కొందరు. సమాజం కోసం, చుట్టూ ఉన్న వారి కోసం సర్దుకుపోవడం అనే మాటే రానివ్వడం లేదు. ఇలాంటి అంశాల్లో సినిమా వారు ఓ అడుగు ముందే ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ప్రేమ, పెళ్లి వంటి బంధాల్లోకి ప్రవేశిస్తారు. అలానే విడాకులు తీసుకోవడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయరు. తాజాగా సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ కు సంబంధించి ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఆయన విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

బబ్లూ పృథ్వీ రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా నటించారు. సినిమాల్లో మాత్రమే కాక.. సీరియల్స్ కూడా యాక్ట్ చేశారు. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నారు. నేడు రిలీజైన యానిమల్ సినిమాలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అలానే దయ వెబ్ సిరిస్ లో కూడా నటించారు.

సినిమాల సంగతి అలా ఉంచితే.. ఆయన వ్యక్తిగత విషయాల ద్వారా ఎక్కువగా లైమ్ లైట్లో ఉంటారు. తాజాగా పృథ్వీరాజ్ కు సంబంధించి మరో వార్త ప్రచారం అవుతోంది. అదేంటంటే.. ఆయన తన రెండో భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారట. వీరిద్దరి వివాహం అయ్యి కేవలం ఏడాది మాత్రమే అవుతుంది. ఇంతలోనే వీరు డైవర్స్ తీసుకోబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. పృథ్వీరాజ్ గతేడాది వయసులో తనకన్నా 30 ఏళ్లు చిన్నదైన రుక్మిణి శీతల్ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మిణి తెలుగమ్మాయే.

గతేడాది నవంబర్ లో వీరి వివాహం జరిగింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. పెళ్లైన ఏడాదికే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారంట. పైగా వీటికి బలం చేకూరుస్తూ.. పృథ్వీరాజ్ తనకు ప్రపోజ్ చేసిన వీడియోని డిలీజ్ చేసింది రుక్మిణి. దాంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. మరి ఈ వార్తలు నిజమో, కాదో తెలియాలంటే.. దీనిపై వీరు స్పందించాలి.

పృథ్వీరాజ్ కు రుక్మిణి కన్నా ముందు బీనా అనే మహిళతో.. 1994లో వివాహం అయ్యింది. వీరికి అహద్ మోహన్ జబ్బర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో కలతలు రేగాయి. ఇద్దరు విడి విడిగా జీవించడం ప్రారంభించారు. ఆరేళ్లు విడిగా బతికిన తర్వాత.. గతేడాది విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రుక్మిణితో పరియం, ప్రేమ, వివాహం చకచకా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు ఆమెతో కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet