iDreamPost

నేడు అసెంబ్లీ కి ఆర్టీసీ విలీనం బిల్లు

నేడు అసెంబ్లీ కి ఆర్టీసీ విలీనం బిల్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. విలీనానికి అసెంబ్లీ ఆమోద ముద్ర వేయనుంది. ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ‘అబ్జార‡్ష్పన్‌ ఆఫ్‌ ఎంప్లాయిస్‌ ఆఫ్‌ ఏపీఎస్‌ఆర్‌టీసీ ఇన్‌ టు గవర్నమెంట్‌ సర్వీసు యాక్ట్‌–2019’ బిల్లును రవాణా మంత్రి పేర్ని నాని సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేసి, ఆర్టీసీ ఉద్యోగులందరినీఈ శాఖ కిందకు తీసుకొస్తారు. ఈ చట్టం ద్వారా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని సీఎం జగన్ హామీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హామీని నెరవేర్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి