iDreamPost

రూ. 500కే గ్యాస్ పొందాలంటే.. ఈ కార్డు తప్పనిసరి..!

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చక చక అమలు చేసే పనిలో నిమగ్నమైంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుండగా.. మరికొన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రూ. 500కే గ్యాస్ పొందాలంటే..?

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను చక చక అమలు చేసే పనిలో నిమగ్నమైంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుండగా.. మరికొన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రూ. 500కే గ్యాస్ పొందాలంటే..?

రూ. 500కే గ్యాస్ పొందాలంటే.. ఈ కార్డు తప్పనిసరి..!

తెలంగాణలో కొలువు దీరిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మురం చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలను అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే అమలు చేస్తామని చెబుతోంది. మాట ప్రకారం.. వాటిని అప్లై చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు, యువతులకు, విద్యార్థినులకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని అందించింది. ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచింది. అలాగే పెళ్లైన మహిళలందరికీ రూ. 2500 చొప్పున అందించే పథకాన్ని కూడా త్వరలో అమలు పర్చనుంది. రైతు భరోసా నిధుల విడుదలకు కూడా ఆమోదం తెలిపిన సంగతి విదితమే. కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా ఆమోదం తెలిపింది.

ఇప్పుడు మరో పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అదే మహాలక్ష్మి పథకంలో భాగమైన రూ. 500కే గ్యాస్ అందించనుంది. దీన్ని కూడా త్వరలోనే అమలు చేయనుంది. ఈ ఏడాది చివరిలో కానీ, జనవరి తొలి నుండి ఈ పథకాన్ని అమలు చేయొచ్చునని తెలుస్తోంది. అయితే లబ్దిదారుల ఎంపికపై పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని ఎవరికి వర్తింపజేయాలన్న విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. రేషన్ కార్డు హోల్డర్స్‌కు మాత్రమే ఈ పథకంలో లబ్దిదారుగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తొలుత రేషన్ కార్డు లేని వారికి కూడా రూ. 500కే గ్యాస్ అందించాలని భావించినప్పటికీ.. ఇప్పుడు రేషన్ కార్డు లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయించింది పౌరసరఫరాల శాఖ.

ఈ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు లబ్దిదారుల నుండి బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని ప్రతిపాదన తీసుకువచ్చింది. అయితే చాలా రోజుల నుండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డు జారీ జరగలేదు. ఇప్పుడు ఈ ప్రతిపాదన అమలు చేస్తే చాలా మంది తెల్ల రేషన్ కార్డు లేని ఎల్పీజీ వినియోగదారులు నష్టపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కలెక్షన్లు ఉన్నాయి. రేషన్ కార్డుల సంఖ్య 89.99 లక్షలు కాగా, గివ్ ఇట్ అప్ లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే.. 85.79 మంది లబ్దిదారులు అయ్యారు. రేషన్ కార్డు డేటాబేస్ ఆధారంగా చూస్తే.. గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలు ఉంది. అలాగే రాష్ట్రంలో లక్ష మంది తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులు ఉన్నట్లు సమాచారం. అలాగే  కొత్తగా తీసుకున్న గ్యాస్ కలెక్షన్లకు ఈ పథకాన్ని అమలు చేయవద్దని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మరీ పౌరసరఫరాల శాఖ చేసిన ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి