iDreamPost

రూ.100 మందును రూ.3 లక్షలకు అమ్మిన కేటుగాళ్లు!

వైద్యరంగంలో నకిలీ మందులు కలకలం సృష్టిస్తున్నాయి. కొందరు కేటు గాళ్లు అక్రమ సంపాదన కోసం నకిలీ మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తాజాగా రూ.100ల విలువ చేసే మందును క్యాన్సర్ ఇంజెక్షన్ గా రూ.3 లక్షలకు విక్రయించారు.

వైద్యరంగంలో నకిలీ మందులు కలకలం సృష్టిస్తున్నాయి. కొందరు కేటు గాళ్లు అక్రమ సంపాదన కోసం నకిలీ మందులను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తాజాగా రూ.100ల విలువ చేసే మందును క్యాన్సర్ ఇంజెక్షన్ గా రూ.3 లక్షలకు విక్రయించారు.

రూ.100 మందును రూ.3 లక్షలకు అమ్మిన కేటుగాళ్లు!

ఇటీవల కాలంలో మోసాలకు పాల్పడే వారి సంఖ్య బాగా పెరిగి పోయింది. ఈ చీటింగ్ అనేది కేవలం ఒక రంగానికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉంది. ముఖ్యంగా నకిలీ వస్తువులు అమ్ముతూ డబ్బులు సంపాందింస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య రంగంలో కూడా దారుణమైన మోసాలు జరుగుతున్నాయి. ప్రాణాల కోసం మోసగాళ్లు చెప్పే మాటలు విని.. ఎందరో లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నకిలీ మందులు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా కొందరు కేటుగాళ్లు రూ.100 విలువ చేసే మందును రూ.3 లక్షలకు అమ్ముతున్నారు. వీరి గుట్టును పోలీసులు ఛేదించారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగింది.

ప్రజలకు అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్స కోసం ఎంత డబ్బులు ఖర్చు చేయడానికైన వెనుకాడరు. ఇలా సామాన్యుల అవసరాన్ని బలహీనతగా చేసుకుని కొందరు కేటుగాళ్లు నకిలీ మందులు మార్కెట్ లో అమ్ముతున్నారు. ఇలాంటి ముఠాలను ఎప్పటికప్పుడు పోలీసులు పట్టుకుని జైలుకు పంపుతున్నారు. అయినా కూడా ఇంకా ఎదో ఒక ప్రాంతంలో నకిలీ మందులు సప్లయ్ జరుతుంది. తాజాగా మంగళవారం ఢిల్లీలో నకిలీ మెడికల్ రాకెట్ గుట్టును పోలీసులు ఛేదించారు. నకిలీ మందులు తయారు చేస్తున్న ఏడుగురిని పోలీసు అరెస్ట్ చేశారు. రూ.100 విలువ చేసే  యాంటీ ఫంగల్ మెడిసిన్ ను ఖాలీ వయల్స్ లో నింపి క్యాన్సర్ మందుగా విక్రయిస్తున్నారు. ఇందుకుగానూ వారు ఒక్కొక్క సూదిని రూ.3 లక్షలకు విక్రయించారు.

నకిలీ మందుల విక్రయానికి సంబంధించి సమాచారం అందటంతో ఢిల్లీలోని మోతీ నగర్, గుర్గావ్‌లోని సౌత్ సిటీ, యమునా విహార్ మరియు ఢిల్లీ ఆసుపత్రిలో ఏకకాలంలో పోలీసుల బృందం దాడి చేసింది. ఈ దాడుల్లో భారీగా ఇంజెక్షన్లను పోలీసులు గుర్తించారు. ఇక విఫిల్ జైన్ (46), సూరజ్ షాట్ (28), నీరజ్ చౌహాన్ (38), తుషార్ చౌహాన్ (28), పర్వేజ్ (33), కోమల్ తివారీ (39), అభినయ్ కోహ్లీ (30) అనే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో 140 కంటే ఎక్కువ నకిలీ మందులను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 4 కోట్ల ఖరీదు  ఉంటుంది.

7 members arrest for sale fake cancer medicine

అలానే మెషీన్లు, ప్యాకింగ్ మెటీరియల్, లేబుల్ చేసిన వైల్స్, ప్రింటెడ్ లిటరేచర్, రబ్బర్ ప్యాక్ సీల్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందింతులు తయారు చేసిన మందులను క్యాన్సర్ ఇంజెక్షన్‌లను విక్రయించి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని నిందింతులో ఒకరైన జైన్ భావించారని పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు నిందితులు 7 వేల ఇంజక్షన్లు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడే కాకుండా చైనా, అమెరికాకు కూడా ఈ మందులు ఎగుమతి చేశారు. మరి..ఇలాంటి నకిలీ మందులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి