iDreamPost

RRR Release : రాజమౌళి ప్లాన్ చేసింది అందుకేనా

RRR Release : రాజమౌళి ప్లాన్ చేసింది అందుకేనా

నిన్న ఉన్నట్టుండి ఆర్ఆర్ఆర్ విడుదల తేదీలు ప్రకటించడం అనూహ్య పరిణామం. రాజమౌళి చాలా ముందు జాగ్రత్తగా ఏకంగా రెండు డేట్లు ఇవ్వడం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. వీటిలో దేనికి కట్టుబడినా ఇతర సినిమాలు ఇబ్బంది పడే మాట వాస్తవం. ముందు ఇచ్చిన ఆప్షన్ మార్చి 18. నిజానికిది రాధే శ్యామ్ టీమ్ పరిశీలనలో ఉంది. కానీ వాళ్ళు డిసైడ్ చేసుకోవడంలో ఆలస్యం కావడంతో ఇది కాస్తా జక్కన్నకు వరంగా మారింది. ఏప్రిల్ 1న ఆచార్య ఫిక్స్ అయ్యింది. అంటే కేవలం 12 రోజుల గ్యాప్ లో రెండు రామ్ చరణ్ సినిమాలు రావడం కలెక్షన్ల పరంగా ప్రభావం చూపించదా అంటే ఔనని చెప్పక తప్పదు. పరిస్థితి అలా ఉంది మరి.

ఇక ఏప్రిల్ 28 సంగతి చూస్తే అదే నెల 14న కెజిఎఫ్ 2, బీస్ట్, లాల్ సింగ్ చద్దాలు వస్తాయి. రెండు వారాల తేడాతో నాలుగు పాన్ ఇండియా సినిమాలు క్లాష్ కావడం బాక్సాఫీస్ కోరుకునేది కాదు. ఎందుకంటే వీటిలో ఒక్కోదానికి కనీసం నెల రోజుల సేఫ్ రన్ దక్కితేనే పెట్టుబడులు సేఫ్ అవుతాయి. అలాంటిది ఇంకా తక్కువ నిడివి అంటే ఇబ్బందే. మరోవైపు ఆల్రెడీ 28న లాక్ చేసుకున్న ఎఫ్3 అయోమయంలో పడుతుంది. ముందే రావాలా లేక మే నెలకు వెళ్లాలా అనేది నిర్మాత దిల్ రాజు నిర్ణయించుకోవాలి. లేదూ నేరుగా తలపడతాం అంటే థియేటర్ల పరంగా వచ్చే చిక్కుముడులను జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఇది అంత సులభం కాదు.

ఇలా రెండు వైపులా ఆర్ఆర్ఆర్ చక్రబంధనం బిగించేసింది. ఏదో ఒకటే డేట్ చెప్పి తీరా అప్పటికి కరోనా కేసులు తగ్గకపోతే మళ్ళీ మాట పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో దానయ్య టీమ్ ఇలా చేయడం మంచిదే కానీ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో రెండు ఆప్షన్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదనేది ట్రేడ్ అభిప్రాయం. ఇంకా రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి ఆసక్తికర పరిణామాలు జరుగుతాయో అన్నది సస్పెన్స్ గా మారింది.సుమారు 300 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ ని టార్గెట్ చేసుకున్న ఆర్ఆర్ఆర్ అసలు ఏ ముహూర్తంలో మొదలయ్యిందో కానీ అప్పటి నుంచి అన్నీ అడ్డంకులే

Also Read : Radhe Shyam : డార్లింగ్ అభిమానులకు త్వరలో శుభవార్త ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి