iDreamPost

RRR Malli : సంచలనం సృష్టించిన చైల్డ్ ఆర్టిస్ట్ నేపథ్యం

RRR Malli : సంచలనం సృష్టించిన చైల్డ్ ఆర్టిస్ట్ నేపథ్యం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న RRR ఓపెనింగ్ సీన్ లో వచ్చే మల్లి పాత్రను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. అసలు ఆమెను బ్రిటిషర్లు తీసుకెళ్లకపోతే భీమ్ ఢిల్లీకి వచ్చేవాడు కాదు, రామరాజును కలిసేవాడు కాదు. అంత ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ కాబట్టే అంతగా గుర్తుండిపోతుంది. కొమ్మా ఊయాలా కోనా ఊయలా అంటూ పాడే పాట క్యాచీగా ఉండటంతో జనానికి బాగా ఎక్కేసింది. మూడు గంటల సినిమాలో వాస్తవానికి తను కనిపించేది మహా అయితే అయిదు నిమిషాలే. అంతకన్నా ఎక్కువ లేదు. కానీ ఇంపాక్ట్ మాత్రం గట్టిగా నిలిచిపోయింది. ఇంతకీ ఈ మల్లి ఎవరు, అసలు పేరు ఏంటి లాంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. అదేంటో చూద్దాం.

తన పేరు ట్వింకిల్ శర్మ. మోడల్ కం ఆర్టిస్ట్. డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షో ద్వారా ఈమెకు మొదటి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఇండియాస్ బెస్ట్ డ్రామే బాజేలో టాప్ 8 కంటెస్టెంట్స్ లో చోటు సంపాదించుకుంది. విజేత కాలేకపోయినా మంచి టాలెంట్ తో జడ్జ్ లను, ప్రేక్షకులను మెప్పించింది. చాలా టీవీ యాడ్స్ లో ట్వింకిల్ ని చూడొచ్చు. ఇటీవలే ప్రసారమైన ఫ్లిప్ కార్ట్ ప్రకటనలలోనూ నటించింది. బయట లుక్స్ తో చూస్తే ఆర్ఆర్ఆర్ మల్లి తనేనా అనిపించేంత వ్యత్యాసం కనిపిస్తుంది. చిన్న వయసులోనే ఇంత పాపులారిటీ తెచ్చుకున్న ట్వింకిల్ శర్మకు ఇప్పుడు రాజమౌళి పుణ్యమాని నేషనల్ లెవెల్ లో గుర్తింపు వచ్చింది.

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ట్వింకిల్ శర్మకు ఫాలోయర్స్ పెరుగుతున్నాయి. తన గురించి వివరాలు తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆఫర్లు కూడా గట్టిగానే వస్తున్నాయట. ట్రిపులార్ లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడి ముందు నన్ను ఇడిసి పోకన్నా అంటూ ఎమోషనల్ డైలాగుని పలికించిన తీరుని బట్టి చెప్పొచ్చు తను ఎలాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్టో. ఏదైతేనేం జక్కన్న చేతిలో పడ్డాక ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు క్యూ కడతాయి.ఇంకా చిన్న వయసే కాబట్టి భవిష్యత్తులో హీరోయిన్ కావాలని టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు చేసిన ఆర్ఆర్ఆర్ పెర్ఫార్మన్స్ తనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.

Also Read : Radhe Shyam OTT Premier : ఇలా అయితే థియేటర్ల మీద దెబ్బ పడదా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి