iDreamPost

మిలియన్ల లెక్కలు ఎలా ఉన్నాయి

మిలియన్ల లెక్కలు ఎలా ఉన్నాయి

నిన్న సినిమా విడుదలయ్యే రేంజ్ లో ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్ ని ఆన్ లైన్ లో రిలీజ్ చేయడంతో సోషల్ మీడియా అభిమానులకు గంటల తరబడి ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇరవై నాలుగు గంటల నిడివిలో పాత రికార్డులన్నీ బద్ధలవుతాయనే అంచనా గట్టిగా ఉండేది. కానీ ఒక రోజు దాటాక కూడా ఆర్ఆర్ఆర్ దోస్తీ తెలుగు వెర్షన్ ఇంకా పది మిలియన్ల మార్కు కూడా చేరుకోలేదు. తమిళ వెర్షన్ 3 మిలియన్లకు దగ్గర, కన్నడ 1 మిలియన్, మలయాళం 1 మిలియన్, హిందీ అన్నింటి కంటే ఎక్కువగా 8 మిలియన్లకు చేరువగా ఉంది. అన్ని భాషలు కలిపినా కూడా ఇంకా పాతిక మిలియన్లు కాలేదు. ఈ కౌంట్ ఇకపై పెరుగుతుంది కానీ ఫస్ట్ డే కౌంట్ ఇక్కడ చాలా కీలకం.

Watch Dosti Song: Dosti Telugu Music Video

నిజానికిది గొప్ప స్పందన అనలేం కానీ పాటను కంపోజ్ చేసిన తీరు, ఒక డిఫరెంట్ థాట్ తో ఇలా చిత్రీకరించిన వైనం ఫ్యాన్స్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చింది. ముఖ్యంగా పాట చివరి షాట్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను ఒకే ఫ్రేమ్ లో ప్రెజెంట్ చేయడం వాళ్లకు గూస్ బంప్స్ ఇచ్చినట్టే ఉంది. అయితే పాట మొత్తం ఈ ఇద్దరూ కనిపిస్తారనుకుంటే దానికి భిన్నంగా కీరవాణితో పాటు అయిదుగురు గాయకులు కనిపించడం ఎక్కువ రిపీట్ వ్యూస్ రాకుండా అడ్డు పడుతోందని చెప్పొచ్చు. మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే అభిమానులు నేరుగా ఫార్వార్డ్ చేసుకుని లాస్ట్ బిట్స్ కి వెళ్లిపోతున్నారు.

మొత్తానికి ఆర్ఆర్ఆర్ కు కావాల్సిన ప్రాధమిక హైప్ అయితే బాగానే వచ్చింది. అసలైన టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు పూర్తి సత్తా బయటికి వస్తుంది. ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ కోసం యూరోప్ వెళ్తున్న రాజమౌళి టీమ్ తిరిగి రాగానే ప్రమోషన్ల వేగం పెంచబోతోంది. అక్టోబర్ 13 విడుదలలో ఎలాంటి మార్పు లేదు. అప్పటికంతా దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుస్తారనే నమ్మకం నిర్మాతల్లో కనిపిస్తోంది. వచ్చే నెల పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో కానీ ఇప్పటికైతే ఫస్ట్ కాపీ సిద్ధం చేసే దిశగా పోస్ట్ ప్రొడక్షన్ ని వేగవంతం చేశారు. ఈ నెలాఖరు నుంచి పబ్లిసిటీ జోరు పెంచి అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లే పనిలో నిమగ్నమవుతారు జక్కన్న

Also Read: నితిన్ క్రేజీ రీమేక్ ఎప్పుడు వస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి