iDreamPost

ఒకే ట్రాక్‌పై వచ్చిన మూడు రైళ్లు..అంతలోనే..

  • Published Nov 23, 2023 | 12:47 PMUpdated Nov 23, 2023 | 12:47 PM

ఈ మద్య కాలంలో తరుచూ రైలు ప్రమాదాలు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఒకదశలో రైలు ప్రయాణం చేయాలంటే క్షేమంగా ఇంటికి చేరుకుంటామా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ మద్య కాలంలో తరుచూ రైలు ప్రమాదాలు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఒకదశలో రైలు ప్రయాణం చేయాలంటే క్షేమంగా ఇంటికి చేరుకుంటామా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  • Published Nov 23, 2023 | 12:47 PMUpdated Nov 23, 2023 | 12:47 PM
ఒకే ట్రాక్‌పై వచ్చిన మూడు రైళ్లు..అంతలోనే..

ఇటీవల దేశంలో తరుచూ రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ఒడిశా రైలు ప్రమాదం గుర్తుకు వస్తే ఒళ్ళు జలదరిస్తుంది. యావత్ భారత దేశం మొత్తం ఈ ఘటనతో ఉలిక్కి పడింది. ఒడిశా రాష్ట్రంలో బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో నిమిషాల వ్యవధిలో మూడు రైళ్లు ఢీ కొనడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు వందల మంది చనిపోగా.. వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇటీవల 28 గుర్తు తెలియని మృతదేహాలను దహనం చేశారు. ఈ రైలు ఘటన తర్వాత మరికొన్ని రైలు ప్రమాదాలు జరిగాయి. తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. ఒకే ట్రాక్ పై ఒక్కసారే మూడు రైళ్లు దూసుకు వచ్చాయి.. అదృష్టం కొద్ది ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే..

సుందర్ గఢ్ జిల్లాలోని రవుర్కెలా రైల్వే స్టేషన్ వద్ద బుధవారం వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ తో సహా రెండు ప్యాసింజర్ ట్రైన్స్ ఒకే ట్రాక్ పై దూసుకు వచ్చాయి. అదృష్టం కొద్ది ఎలాంటి ప్రమాదం మాత్రం జరగలేదు. రవుర్కెలా-ఝార్సుగూడ ప్యాసింజర్ ట్రైన్, సంబల్ పూర్-రవుర్కెలా మెమూ ట్రైన్ దాదాపు 100 మీటర్ల దూరంలో ఒకే లైన్ లోకి ఎదురెదురుగా వచ్చాయి. మూడో రైలు పూరీ-రవుర్కెలా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు అదే ట్రాక్ పై వస్తుంది.. మెము- ప్యాసింజర్ ట్రైన్ వంద మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన రవుర్కెలా రైల్వే స్టేషన్ కి దాదాపు రెండు వందల మీటర్ల దూరంలో జరిగింది. అయితే ఈ ఘటనకు కారణం రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే జరిగి ఉండవొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించలేదు.

ఒడిశా రైల్ ప్రమాద ఘటన తర్వాత రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థపై పలు ఆరోపణుల వెల్లువెత్తాయి. ఎవరో చేస్తున్న నిర్లక్ష్య వల్ల రైలు ప్రమాదాలు జరి..కోట్ల ఆస్తి నష్టంతో పాటు ఎంతోమంది అమాయకులు బలి అవుతున్నారని దుమ్మెత్తి పోశారు. మరోవైపు రైల్వే శాఖ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. సిగ్నలింగ్ వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేకుండా చూస్తున్నామని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఉదయం ఒకే ట్రాక్ పై మూడు రైళ్లు రావడం వార్త సోషల్ మీడియాలో ఒక్కసారే షాక్ తినేలా చేసింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడం.. అందరూ ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి