iDreamPost

స్వీపర్ పని చేస్తూ 50 కోట్లు పైనే సంపాదించాడు.. ఎలాగో తెలుసా?

అతి సాధారణ జీవితం గడిపే వ్యక్తికి కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలా కష్టం. అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా 50 కోట్లు పైనే సంపాదించాడు. అది కూడా స్వీపర్ పని చేస్తూ. అదెలా సాధ్యమో తెలియాలంటే ఈ పెద్దాయన సక్సెస్ స్టోరీ తెలుసుకోవాల్సిందే.

అతి సాధారణ జీవితం గడిపే వ్యక్తికి కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలా కష్టం. అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా 50 కోట్లు పైనే సంపాదించాడు. అది కూడా స్వీపర్ పని చేస్తూ. అదెలా సాధ్యమో తెలియాలంటే ఈ పెద్దాయన సక్సెస్ స్టోరీ తెలుసుకోవాల్సిందే.

స్వీపర్ పని చేస్తూ 50 కోట్లు పైనే సంపాదించాడు.. ఎలాగో తెలుసా?

స్వీపర్ గా పని చేస్తూ ఒక మనిషి 50 కోట్లు పైనే సంపాదించాడంటే నమ్ముతారా? జీవితమంతా పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్ లో పని చేసిన ఈ వ్యక్తి అన్ని కోట్లు సంపాదించాడంటే లాటరీ వల్లే అయి ఉంటుంది అని అనుకుంటున్నారు కదూ. కానీ అది లాటరీ వల్ల రాలేదు. అతను చేసిన తెలివైన పని వల్ల వచ్చింది. ఏంటా పని? అతి సాధారణ స్వీపర్ ఎలా ఇన్ని కోట్లు సంపాదించగలిగాడు? ఈ క్రమంలో అతను అనుసరించిన మార్గాలు ఏంటి? అనే వివరాలు మీ కోసం. 

అతని పేరు రొనాల్డ్ జేమ్స్ రీడ్. అమెరికాకి చెందిన వ్యక్తి. 1921లో జన్మించాడు. అయితే అతని కుటుంబంలో హైస్కూల్లో చదువుకున్న వారు ఎవరూ లేరు. ఇతనే మొట్ట మొదటి వ్యక్తి. రెండో ప్రపంచ యుద్ధంలో మిలిటరీ పోలీస్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత 25 ఏళ్ల పాటు గ్యాస్ స్టేషన్ లో కార్ మెకానిక్ గా పని చేశాడు. ఆ తర్వాత జేసీ పెన్నీ అనే స్టోర్ లో ఫ్లోర్ క్లీనర్ గా పని చేశాడు. ఫ్లో క్లీనర్ గా 17 ఏళ్ల పాటు పని చేశాడు. కేర్ టేకర్ గా, వాచ్ మేన్ గా కూడా పని చేశాడు. ఈ పనులు చేస్తూ సాధారణ జీతం సంపాదించేవాడు. తన జీతం తక్కువే అయినా కూడా తన సంపాదన నుంచి కొంత డబ్బు తీసి స్టాక్స్ లో పెట్టుబడి పెడుతూ వచ్చాడు. స్టాక్ మార్కెట్లో షేర్స్ కొని వాటి విలువ పెంచుకుంటూ వచ్చాడు.

వృద్ధాప్యానికి వచ్చేసరికి ఆ స్టాక్స్ విలువ 8.2 మిలియన్ డాలర్స్ అయ్యింది. ఆ సమయంలో అప్పటి డాలర్ రేట్ ప్రకారం అతని వద్ద ఉన్న ఆస్తి విలువ 50 కోట్లు. ఇప్పటి లెక్కల ప్రకారం అయితే 68 కోట్లు. స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్స్, సాలిడ్ ప్రిన్సిపల్స్ తెలిసిన తెలివైన పెట్టుబడిదారుడు ఈయన. స్టాక్ మార్కెట్ గురించి, షేర్స్ గురించి, కంపెనీ గురించి పూర్తిగా అధ్యయనం చేసి అప్పుడు పెట్టుబడి పెట్టాడు. జేమ్స్ రీడ్ ఎవరినీ అనుసరించలేదు. తానే సొంతంగా కొన్ని రూల్స్ ని, ఫండమెంటల్స్ ని పెట్టుకున్నాడు. అయితే ఇతను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి మాత్రమే కట్టుబడి ఉన్నాడు. కాంపౌండింగ్ ఎఫెక్ట్స్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా షేర్స్ విలువ పెరుగుతుందని నమ్మిన వాటి పైనే ఫోకస్ పెట్టాడు.

ప్రాక్టర్ అండ్ గాంబుల్, జేపీ మోర్గాన్ ఛేజ్, జనరల్ ఎలక్ట్రిక్, డో కెమికల్ కంపెనీ వంటి బ్లూ చిప్స్ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాడు. అంతే అప్పటి నుంచి ఆ షేర్స్ ని అలానే ఉంచాడు. జీతం పడినప్పుడల్లా ఖర్చులు పోనూ మిగతా డబ్బుతో షేర్స్ కొనేవాడు. అలా కొంచెం కొంచెం పెడుతూ వచ్చిన షేర్స్ విలువ ఊహించని విధంగా పెరిగిపోయింది. అయితే ఇంత డబ్బు వచ్చింది కాబట్టి ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడా అంటే అలా ఏం చేయలేదు. 92 ఏళ్ల వయసులో అతను ఒక చిన్న ఇంటిలో సాధారణ జీవితం గడుపుతూ 2014లో జూన్ 2న మరణించాడు. అయితే చనిపోయే ముందు లైబ్రరీ కోసం 1.2 మిలియన్ డాలర్స్, అలానే హాస్పిటల్ కోసం 4.8 మిలియన్ డాలర్స్ ని విరాళంగా ఇచ్చాడు. అంటే 2014లో భారత్ లో డాలర్ ప్రకారం సుమారు 40 కోట్లు అన్న మాట. జీవించినంత కాలం పేదరికంలోనే జీవించాడు. పేదరికంతోనే మరణించాడు.

50 ఏళ్ల వయసులో అతని భార్య చనిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదు. అందుకే మిలియన్ డాలర్ల డబ్బుని సమాజానికి  డొనేట్ చేశాడు. సమాజం నుంచి తీసుకున్న డబ్బుని తిరిగి అదే సమాజానికి వెనక్కి ఇవ్వాలన్న దానికి ఈయనే ఒక ఉదాహరణ. ఇతను పేదరికంలో జీవించి ఉండవచ్చు కానీ అత్యంత రిచ్ హార్ట్ తో జీవించి అందరి మనసులను గెలుచుకున్నాడు. అమెరికాలో 2014 ఏడాదిలో చనిపోయిన వారి సంఖ్య 28,13,503 కాగా.. అందులో 8 మిలియన్ డాలర్స్ సంపద కలిగిన వారు 4 వేల మంది మాత్రమే. ఈ 4 వేల మందిలో రొనాల్డ్ జేమ్స్ రీడ్ ఒకరు. చాలా వినయంగా ఉండే ఈ స్వీపర్ అప్పట్లో ఇంటర్నేషనల్ హెడ్ లైన్స్ కి ఎక్కారు. లైఫ్ స్టైల్ ని కంట్రోల్ పెట్టుకుంటూ.. డబ్బు సంపాదించాలన్న సంకల్పం పట్ల కమిటెడ్ గా ఉంటే ఈ పెద్దాయనలా కోట్లు సంపాదించవచ్చు.

ఉదాహరణకు ఈయనలా 8 మిలియన్ డాలర్లు సంపాదించాలనుకుంటే.. నెలకు 300 డాలర్లు చొప్పున 8 శాతం వడ్డీ రేటుకి 65 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని నిపుణులు వెల్లడించారు. ఏది ఏమైనా కోట్లు సంపాదించాలంటే ఓపిక ఉండాలి. ఏళ్ల తరబడి ఓపిగ్గా పెట్టుబడి పెడుతూ ఉండాలి. చిన్న వయసులో ఉన్నప్పుడే నెలకు కొంత డబ్బుని ఇలా మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ టైంలో మంచి అమౌంట్ వస్తుంది. పిల్లలకు, వారి పిల్లలకు ఆ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంతమంది భూముల మీద, స్థలాల మీద పెడుతుంటారు. ఇది కూడా మంచిదే. అయితే రిస్క్ కూడా ఉంటుందని గమనించాలి. రిస్క్ అని తెలిసినా కూడా తన పెట్టుబడి పెరుగుతుందని నమ్మి దిగాడు ఈ పెద్దాయన. అలా ఓపిగ్గా పెట్టుబడి పెట్టుకుంటూ మిలియనీర్ అయ్యాడు. మరి ఈ పెద్దాయన నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే కనుక.. ఆర్థిక క్రమశిక్షణ, సహనం, ఓపిక వంటి సద్గుణాలతో పాటు సేవాగుణాన్ని కూడా నేర్చుకోవచ్చు. మరి సాధారణ జీవితం గడిపే వ్యక్తి కోట్లు సంపాదించవచ్చు అని నిరూపించిన రొనాల్డ్ జేమ్స్ రీడ్ సక్సెస్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి