iDreamPost

Video: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన బోయింగ్‌ విమానం..73 మంది!

ఈ మధ్యకాలంలో జరగుతున్న  విమానాల ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళకు గురి చేస్తున్నాయి. సాంకేతిక సమస్య వంటి ఇతర కారణాలతో హెలికాప్టర్, ఫ్లైట్ లు ప్రమాదాలకు గురువుతున్నాయి. తాజాగా 73 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకులిపోయింది.

ఈ మధ్యకాలంలో జరగుతున్న  విమానాల ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళకు గురి చేస్తున్నాయి. సాంకేతిక సమస్య వంటి ఇతర కారణాలతో హెలికాప్టర్, ఫ్లైట్ లు ప్రమాదాలకు గురువుతున్నాయి. తాజాగా 73 మందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకులిపోయింది.

Video: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన బోయింగ్‌ విమానం..73 మంది!

ఇటీవల కాలంలో జరగుతున్న విమానాల ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళకు గురి చేస్తున్నాయి. సాంకేతిక సమస్య వంటి ఇతర కారణాలతో హెలికాప్టర్, ఫ్లైట్ లు ప్రమాదాలకు గురువుతున్నాయి. దీంతో ప్రయాణికులు ప్లైట్ లో జర్నీ చేసేందుకు కాస్తా ఆలోచిస్తున్నారు. వారం క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్ లో సాకేంతిక సమస్య తలెత్తడంతో వెంటనే ల్యాండ్ చేశారు. అలానే గతేడాది నేపాల్ లో జరిగిన ఓ ఘోర విమాన ప్రమాదంలో 72 మంది సజీవ దహనం అయ్యారు. తాజాగా ఓ బోయింగ్ విమానం ప్రమాదానిక గురైంది. అందులో 73 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన సెనెగల్ దేశంలో జరిగింది.

ఆఫ్రికా ఖండంలోని సెనెగల్ దేశంలో ఓ బోయింగ్ విమానం ప్రమాధానికి గురైంది. సెనెగల్ దేశ రాజధాని డాకర్ సమీపంలో ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. అక్కడి ప్రధాన విమానాశ్రయంలోని రన్ వేపై ఈ విమానం జారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఈ విమానం ఘటన గురువారం అర్ధరాత్రి ఒంటి గంట తరువాత జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. హవాయి కి చెందిన బోయింగ్ 737-38అనే బోయింగ్ విమానం ప్రమాదానికి గురైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇక విమానం కుప్పకూలిన సమయంలో విమానంలో దాదాపు 73 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రన్ వేపై దిగుతున్న సమయంలో విమాన ఎడమ రెక్క ఇంజిన్ లో మంటలు ఏర్పడినట్లు తెలుస్తోంది. విమానాశ్రయంలోని రన్‌వే పక్కనే ఉన్న పొదల్లో విమానం ల్యాండ్ అవుతున్న వీడియోను ఆన్‌లైన్‌ లో పోస్ట్ చేశారు. బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనతో విమానాశ్రయ మిగిలిన విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానిక మీడియా పేర్కొంది. ఇటీవల కాలంలో విమానాలకు సంబంధించిన అనేక ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. దీంతో వాటిల్లో జర్నీ చేసేందుకు ప్రజలు సంకోచిస్తున్నారు.

గతంలోనూ పలు విమానాలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. అలానే వివిధ సాంకేతి  సమస్యలతో కుప్పకూలిపోయాయి.  కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ లో ఓ హెలికాప్టర్ పేలిపోయి.. ఐదుగురు దుర్మరణం చెందారు. అలానే  మహారాష్ట్రకు చెందిన ఓ శివసేన నేత ప్రయాణించిన హెలికాఫ్టర్ కూడా ప్రమాదానికి గురైంది. గతేదాడి నేపాల్ లో జరిగిన ఓ విమాన అగ్నిప్రమాదంలో 72 మంది సజీవ దహనం అయ్యారు.  మొత్తంగా తాజాగా జరిగిన బోయింగ్ విమాన ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఇలా తరచూ విమాన ప్రమాద ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి