iDreamPost
android-app
ios-app

రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరలవుతున్న వీడియో..

  • Author Soma Sekhar Published - 06:59 PM, Tue - 26 September 23
  • Author Soma Sekhar Published - 06:59 PM, Tue - 26 September 23
రోహిత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరలవుతున్న వీడియో..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్ తో జరిగిన రెండు వన్డేలకు దూరంగా ఉన్నాడు. ఈ విశ్రాంతి సమయాన్ని తన ఫ్యామిలీతో గడిపాడు హిట్ మ్యాన్. ఇక రోహిత్ పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ అని అందరికి తెలిసిన విషయమే. సమయం చిక్కినప్పుడల్లా.. తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటాడు. సిరీస్ లు లేని టైమ్ లో ఫ్యామిలీతో విదేశీ టూర్లకు చెక్కేస్తుంటాడు హిట్ మ్యాన్. ప్రస్తుతం వరల్డ్ కప్ కోసం సిద్దమయ్యే పనిలో నిమగ్నమైయ్యాడు. అయితే ఆసీస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు వన్డేలకు రోహిత్ కు విశ్రాంతినిచ్చారు. చివరి వన్డే కోసం జట్టులో చేరుతున్నాడు రోహిత్. ఈ క్రమంలోనే తన భార్త రోహిత్ ను డ్రాప్ చేయడానికి వచ్చింది రితిక సజ్దే. ఈ సమయంలో అక్కడ ఓ ఆసక్తికర దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి రెండు వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి కూడా విదితమే. ఇక ఈ రెండు వన్డేలకు సీనియర్లు అయిన విరాట్, రోహిత్ లకు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. అయితే రాజ్ కోట్ వేదికగా జరిగే చివరి వన్డే కోసం జట్టులో చేరనున్నారు ఈ ఇద్దరు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై నుంచి రాజ్ కోట్ వెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఇక తన భర్తకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చింది రోహిత్ భార్య రితికా సజ్దే.

ఈ సమయంలో ఓ రొమాంటిక్ దృశ్యం కెమెరా కంటపడింది. అదేంటంటే? కారు దిగి వెళ్లే సమయంలో కారులోకి వంగి మరీ భార్యను కౌగిలించుకున్నాడు రోహిత్. ఆ తర్వాత అతడిని వదిలి వెళ్లడం ఇష్టం లేనట్లుగా ఫేస్ పెట్టింది రితిక. అది చూసిన హిట్ మ్యాన్ నవ్వుతూ.. ఆమెకు టాటా చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ నిజంగా ఫ్యామిలీ మ్యానే అని కొందరు కామెంట్ చేస్తే.. హిట్ మ్యాన్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? అని మరికొందరు సరదాగా రాసుకొచ్చారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetVirüsbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Giriş