iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్‌ కప్‌ ముందు ప్రత్యర్థులకు రోహిత్‌ వార్నింగ్‌! ఇది కదా మగాడి మాట!

  • Published May 30, 2024 | 1:25 PM Updated Updated May 30, 2024 | 1:25 PM

Rohit Sharma, T20 World Cup 2024: మరో మూడు రోజుల్లోనే టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్లుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, T20 World Cup 2024: మరో మూడు రోజుల్లోనే టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్లుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 30, 2024 | 1:25 PMUpdated May 30, 2024 | 1:25 PM
టీ20 వరల్డ్‌ కప్‌ ముందు ప్రత్యర్థులకు రోహిత్‌ వార్నింగ్‌! ఇది కదా మగాడి మాట!

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్‌ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. జూన్‌ 5న టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడి టీ20 వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టనుంది. యావత్‌ క్రికెట్‌ ప్రపంచ ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ జూన్‌ 9న జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ లోకం మొత్తం వేయి కళ్లతో వేయిట్‌ చేస్తోంది. అయితే.. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ముందు.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ప్రత్యర్థి జట్లకు అదిరిపోయే వార్నింగ్‌ ఇచ్చాడు. టీమిండియా వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీమ్‌ అంటూ.. ప్రత్యర్థి జట్లు సరదాగా గుర్తుచేశాడు.

అయితే.. ఇదంతా ప్రెస్‌మీట్‌ పెట్టి ఇచ్చిన వార్నింగ్‌ కాదు.. డ్రీమ్‌ ఎలెవన్‌ చేసిన ఒక యాడ్‌లో రోహిత్‌ శర్మ చెప్పిన డైలాగులు నాటు బాంబుల్లా పేలాయి. ఈ యాడ్‌లో రోహిత్‌ శర్మ, బుమ్రా, జడేజా, హార్ధిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌ కూడా నటించారు. ఈ యాడ్‌ను బీసీసీఐ తమ అధికార ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఇండియా వరల్డ్‌ కప్‌ ఎప్పుడు గెలుస్తుంది.. నేను ఎప్పుడు చూస్తాను.. అని ఓ పిల్లాడు తల్లితో అడిగిన ప్రశ్నకు.. ఆ తల్లి నేరుగా.. టీమిండియా ఆటగాళ్ల దగ్గరికి వెళ్లి.. అసలు మీరు ఏం ప్రాక్టీస్‌ చేస్తున్నారు? అని అడుగుతుంది. లేదు.. మేం అన్ని విధాల సిద్ధంగా ఉన్నాం.. మేం వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీమ్‌ అంటూ రోహిత్‌ శర్మ ఆమెతో చెబుతాడు.

అయినా కూడా ఆమె వినకుండా.. టీమిండియాతోనే ఉంటూ కప్పు కొట్టిస్తానంటూ భీష్మించుకుని కూర్చుంటుంది. ప్రస్తుతం ఈ యాడ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఎంతో ఫన్నీగా ఉన్న యాడ్‌లో.. రోహిత్‌ శర్మ చెప్పిన వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీమ్‌, మేం రెడీగా ఉన్నాం అనే మాటలు.. ఒక విధంగా ఇతర టీమ్స్‌కు వార్నింగ్‌ బెల్‌లా ఉన్నాయంటూ.. భారత క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం టీమిండియా టీ20ల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే వన్డేల్లో కూడా నంబర్‌ వన్‌గా ఉంది. టెస్టుల్లో నంబర్‌ టూ పొజిషన్‌లో ఉంది. అయితే.. 2023లో వరల్డ్‌ కప్‌ మిస్‌ చేసుకున్న రోహిత్‌ సేన.. ఈ సారి అలాంటి తప్పు చేయకుంటా.. ఈ పొట్టి వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకోవాలనే కసితో బరిలోకి దిగుతోంది. మరి డ్రీమ్‌ ఎలెవన్‌ యాడ్‌లో రోహిత్‌ చెప్పిన డైలాగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet