iDreamPost

Rohit Sharma: వన్డేల్లో రోహిత్‌ శర్మ.. టీ20ల్లో రుతురాజ్‌! ఆ జట్టుపై వీళ్లదే రాజ్యం

  • Published Dec 04, 2023 | 8:08 PMUpdated Dec 04, 2023 | 8:08 PM

Rohit Sharma, Ruturaj Gaikwad: రోహిత్‌ శర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇద్దరూ ఒక తరహా ఆటగాళ్లు. ఓపెనర్లుగా వచ్చి.. బౌలర్లపై ఏ మాత్రం కనికరం లేకుండా ఫస్ట్‌ బాల్‌ నుంచే ఎదురుదాడికి దిగుతుంటారు. అయితే.. ఈ ఇద్దరు కలిసి ఓ టీమ్‌పై దండయాత్ర చేస్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపెనర్‌గా వచ్చి.. పవర్‌ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడుతూ ఉంటాడు. ఫస్ట్‌ బాల్‌ నుంచే.. బౌలర్లపై ఎదురుదాడికి దిగే ఒకే ఒక్క ఆటగాడు రోహిత్‌ శర్మ. పిచ్‌ ఎలా ఉన్నా.. ఎదురుగా ఎంత గొప్ప బౌలర్‌ ఉన్నా.. లేకచేయకు​ండా, భయం లేకుండా బ్యాటింగ్‌ చేస్తుంటాడు. తర్వాత వచ్చే బ్యాటర్లు ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడేందుకు మంచి ప్లాట్‌ఫామ్‌ సెట్‌ చేసి పెడతాడు.. ఇంత వేగంగా, ఏ మాత్రం భయం లేకుండా ఆడుతున్నా వన్డేల్లో రోహత్‌ శర్మ ఒక జట్టుపై తిరుగులేని రికార్డు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఆ జట్టుకు వన్డేల్లో రోహిత్‌ శర్మనే సరైనోడు. ఇంతకీ ఆ జట్టు ఏదా అని ఆలోచిస్తున్నారా? అలాంటిలాంటి జట్టు కాదులేండి.. ఇటీవల వరల్డ్‌ కప్‌ గెలిచిన ఆస్ట్రేలియా.

ఆస్ట్రేలియా-భారత మధ్య జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లలో ఆ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ ఉంటే.. టీ20 ఫార్మాట్‌లో ఆ స్థానం యువ చిచ్చరపిడుగు రుతురాజ్‌ గైక్వాడ్‌ తీసుకున్నాడు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ద్వైపాక్షకి టీ20 సిరీస్‌లలో ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇలా ఈ ఇద్దరు అగ్రెసివ్‌ ఓపెనర్లు ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్‌పై మంచి రికార్డులు కలిగి ఉండటం ఇండియన్‌ క్రికెట్‌తో పాటు, రాబోయే యంగ్‌ క్రికెటర్లు ఎంతో స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. కాగా తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్బుతమైన ప్రదర్శన కనబర్చాడు.

తొలి మ్యాచ్‌లో మరో యంగ్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ చేసిన తప్పు కారణంగా రుతురాజ్‌ రనౌట్‌ అయినా.. రెండో టీ20లో హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఇక మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఏకంగా సెంచరీతో విరుచుకుపడ్డాడు. కేవలం 57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సులతో 123 పరుగులు చేసి అదరగొట్టాడు. నాలుగో టీ20లోనూ 32 పరుగులతో రాణించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శన కబర్చిన బ్యాటర్‌గా నిలిచాడు. కాగా, ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి