iDreamPost

టెస్టు గెలిచాక రోహిత్ కామెంట్స్.. నోరు మూసుకుని ఉండాలంటూ..!

SA vs IND 2nd Test: రెండో టెస్టు ముగిసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ అక్కడి పిచ్ లను ఉద్దేశిస్తూ మండిపడ్డాడు. భారత్ పిచ్ లపై కామెంట్ చేసేవాళ్లంతా నోరు మూసుకోవాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

SA vs IND 2nd Test: రెండో టెస్టు ముగిసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ అక్కడి పిచ్ లను ఉద్దేశిస్తూ మండిపడ్డాడు. భారత్ పిచ్ లపై కామెంట్ చేసేవాళ్లంతా నోరు మూసుకోవాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

టెస్టు గెలిచాక రోహిత్ కామెంట్స్.. నోరు మూసుకుని ఉండాలంటూ..!

దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్ లో భాగంగా సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్ మరియు 32 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులో భారత్ విజృంభించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ను సమం చేసి సిరీస్ ను పంచుకుంది. అంతేకాదు కేప్ టౌన్ లో సౌతాఫ్రికాపై గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అయితే రెండో టెస్టు ముగిసిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ అక్కడి పిచ్ లను ఉద్దేశిస్తూ మండిపడ్డాడు. భారత్ పిచ్ లపై కామెంట్ చేసేవాళ్లంతా నోరు మూసుకోవాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

న్యూలాండ్స్ టెస్టు ఒకటిన్నర రోజుల్లో 33 వికెట్లు పతనమై, సిరీస్‌ను 1-1తో సమం అయింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 106.2 ఓవర్లు బౌలింగ్ చేయబడ్డాయి. రెండో టెస్టులో విజయం సాధించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవాన్ని అందించింది. భారత్ టెస్టు మ్యాచ్ ధోనీ కెప్టెన్సీలో సౌతాఫ్రికాపై విజయం సాదించగా ఆ తర్వాత అంతటి ఘనత హిట్ మ్యాన్ కే దక్కింది. రెండో టెస్టులో విన్ అయిన తర్వాత రోహిత్ పిచ్ లగురించి మాట్లాడుతూ చురకలంటించాడు. “భారత్‌ పిచ్ లపై అందరూ నోరు మూసుకుని ఉన్నంత వరకు ఇలాంటి పిచ్‌లపై ఆడటం నాకు అభ్యంతరం లేదని తెలిపాడు.

భారత్‌లో మ్యాచ్ అనగానే బ్రిటీష్, ఆస్ట్రేలియా మీడియాతో పాటు మాజీ ఆటగాళ్లు స్పిన్ పిచ్‌లంటూ మ్యాచ్ ప్రారంభానికి ముందే నిందలు వేస్తూ ఉంటారని విమర్శలు గుప్పించాడు. ఇలా మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటే.. పేస్ వికెట్ల గురించి కూడా తాను మాట్లాడనని తెలిపాడు. ప్రపంచ కప్ ఫైనల్ పిచ్‌కు తక్కువ రేటింగ్ ఇవ్వడం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఒక విదేశీ బ్యాటర్ సెంచరీ చేసిన తర్వాత కూడా ఆ పిచ్‌కు పూర్ రేటింగ్ ఎలా ఇస్తారు? అని రోహిత్ ప్రశ్నించాడు. ఈ తరహా పిచ్‌లపై ఆడేందుకు నేను సిద్దంగా ఉన్నాను. ఇలాంటి పిచ్‌పై ఆడటం సవాల్‌గా భావిస్తున్నానని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. మరి రోహిత్ శర్మ భారత్ పిచ్ లపై విమర్శలు చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి