iDreamPost

Rohit Sharma: ఎవడ్రా రోహిత్ అన్ ఫిట్ అన్నది.. జడేజానే ఓడించాడు! ఈ వీడియో చూడండి

వరల్డ్ క్లాస్ ఫీల్డర్ గా పేరొందిన స్టార్ ఆల్ రౌండర్ జడేజానే ఓడించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు రోహిత్ శర్మ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరల్డ్ క్లాస్ ఫీల్డర్ గా పేరొందిన స్టార్ ఆల్ రౌండర్ జడేజానే ఓడించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు రోహిత్ శర్మ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rohit Sharma: ఎవడ్రా రోహిత్ అన్ ఫిట్ అన్నది.. జడేజానే ఓడించాడు! ఈ వీడియో చూడండి

సాధారణంగా క్రీడా రంగంలో ప్లేయర్లకు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఫిట్ నెస్. ఆటగాళ్లు ఎంత ఫిట్ గా ఉంటే.. గ్రౌండ్ లో అంత దూకుడు చూపించగలుగుతారు. అయితే ప్రపంచ క్రికెట్ లో కొందరు బొద్దుగా ఉండటంతో వారిని నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నాడు. రోహిత్ లావుగా ఉన్నాడని, ఫిట్ గా లేడని, గ్రౌండ్ లో బద్దకంగా కదులుతాడని నెటిజన్లు విమర్శించారు. అయితే ఈ విమర్శలన్నింటికీ సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో సమాధానం ఇచ్చాడు. ఏకంగా వరల్డ్ క్లాస్ ఫీల్డర్ గా పేరొందిన స్టార్ ఆల్ రౌండర్ జడేజానే ఓడించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోహిత్ శర్మ.. బ్యాటింగ్ తో దుమ్మురేపుతాడు, క్రీజ్ లో నిలబడి సిక్స్ లు కొట్టడంలో దిట్ట. అందుకే ఫ్యాన్స్ రోహిత్ ను ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. అయితే అందరూ రోహిత్ ను ప్రశంసించే వారే అనుకుంటే పొరపాటే. అతడ్ని విమర్శించే నోళ్లు కూడా ఉన్నాయి. రోహిత్ లావుగా ఉన్నాడని, అతడు గ్రౌండ్ లో పరిగెత్తలేడని, గేమ్ కు అన్ ఫిట్ అని నానా మాటలు అన్నారు. ఈ విమర్శలన్నింటినీ తట్టుకుంటూనే జట్టుకు నాయకత్వం వహిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా తన ఫిట్ నెస్ పై వచ్చిన విమర్శలన్నింటికీ.. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆన్సర్ ఇచ్చాడు. తొలిరోజు ఆటలో అద్భుతమైన కెప్టెన్సీతో పాటుగా అబ్బురపరిచే ఫీల్డింగ్ తో అదరగొట్టాడు హిట్ మ్యాన్.

ఈ క్రమంలోనే సఫారీ బ్యాటర్ కొట్టిన ఓ బంతిని ఆపేందుకు బౌండరీ లైన్ దగ్గరికి పరిగెత్తుకెళ్లాడు రోహిత్ శర్మ. ఆ బాల్ ను ఫోర్ పోకుండా ఆపాడు. జడేజా-రోహిత్ మధ్య నుంచి వెళ్తున్న బాల్ ను ఆపడానికి ఇద్దరూ పోటీపడి మరీ పరిగెత్తారు. ఈ రన్నింగ్ రేసులో వరల్డ్ ఫాస్టెస్ట్ ఫీల్డర్ గా పేరుగాంచిన జడేజాని ఓడించాడు టీమిండియా కెప్టెన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఎవడ్రా రోహిత్ ను అన్ ఫిట్ అన్నది అంటూ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ అన్ ఫిట్ అన్నవాళ్లు ఈ వీడియో చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పేస్ దెబ్బకు సౌతాఫ్రికా టీమ్ కేవలం 55 రన్స్ కే కుప్పకూలింది. సిరాజ్ 6 వికెట్లు తీసి సఫారీ జట్టు పతనాన్ని శాసించాడు. మరో పేసర్ బుమ్రా 2 , ముకేశ్ కుమార్ 2 వికెట్లతో రాణించారు. మరి రోహిత్ ఫిట్ నెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి