iDreamPost

Rohit-Pandya: రోహిత్ మాస్టర్ మైండ్.. పాండ్యా ప్లేస్ కు ఎసరు? సరైనోడినే దించాడు!

రోహిత్ శర్మ తన మాస్టర్ మైండ్ తో ఏకంగా భవిష్యత్ లో పాండ్యా ప్లేస్ కే ఎసరు పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం హిట్ మ్యాన్ సరైనోడినే దించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మ తన మాస్టర్ మైండ్ తో ఏకంగా భవిష్యత్ లో పాండ్యా ప్లేస్ కే ఎసరు పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం హిట్ మ్యాన్ సరైనోడినే దించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Rohit-Pandya: రోహిత్ మాస్టర్ మైండ్.. పాండ్యా ప్లేస్ కు ఎసరు? సరైనోడినే దించాడు!

రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. తన నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పదవిని గుంజుకున్నాడన్న కోపం రోహిత్ శర్మకు ఉంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఎవరికైనా కోపం రాకమానదు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ పాండ్యాపై గరం గరం అవుతున్న విషయం తెలిసిందే. ఇక హార్దిక్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆఫ్గాన్ తో సిరీస్ కు పాండ్యా అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ.. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. మళ్లీ రోహిత్ శర్మకే సారథ్య బాధ్యతలను అప్పగించింది మేనేజ్ మెంట్. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన మాస్టర్ మైండ్ తో ఏకంగా భవిష్యత్ లో పాండ్యా ప్లేస్ కే ఎసరు పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం హిట్ మ్యాన్ సరైనోడినే దించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం ఐపీఎల్ లోనే కాకుండా భారత క్రికెట్ లో పెను సంచలన సృష్టించింది. దీంతో పాండ్యాకు రోహిత్ కు మధ్య వైరం ఏర్పడింది.ఇక ఈ విషయంపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ హార్దిక్ పై ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. గాయం నుంచి పాండ్యా ఇంకా కోలుకోకపోవడంతో.. టీమిండియా టీ20 పగ్గాలను తిరిగి రోహిత్ కు అప్పగించింది బీసీసీఐ. ఇది పాండ్యాకు పెద్ద షాక్. దీంతో పాండ్యాపై రోహిత్ పైచేయి సాధించినట్లుగా అయ్యింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. రోహిత్ శర్మ తన మాస్టర్ మైండ్ తో హార్దిక్ ప్లేస్ కు ఎసరు పెట్టాడన్న వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటంటే? గత కొంతకాలంగా టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా హార్దిక్ రాణిస్తూ వస్తున్నాడు. కానీ నిరంతరం గాయాలపాలవుతుండటంతో కీలక టోర్నీకు పాండ్యా దూరం అవుతున్నాడు. ఇది భారత జట్టుకు పెద్ద సమస్యగా మారింది. దీంతో పాటుగా ఇటీవల రోహిత్-పాండ్యా వివాదం కూడా అతడి ప్లేస్ లో మరో స్టార్ ఆల్ రౌండరని రెడీ చేయడానికి బీజం వేసిందనే చెప్పాలి. అందులో భాగంగానే రోహిత్ పక్కా ప్లాన్ తో యంగ్ ఆల్ రౌండర్ శివమ్ దుబేని ఆఫ్గాన్ తో సిరీస్ లోకి దించాడు.

తొలి మ్యాచ్ లోనే దుబే తుఫాన్ బ్యాటింగ్ తో ఆలరించాడు. ఈ మ్యాచ్ లో 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచి, జట్టుకు విజయాన్ని అందించాడు. ఇటు బౌలింగ్ లో కూడా అద్భుతం చేశాడు. రెండు ఓవర్లు వేసి కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైన జద్రాన్ వికెట్ తీశాడు. ఇక ఈ ఒక్క మ్యాచ్ తోనే టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్ గా మారిపోయాడు దుబే. పాండ్యా స్థానంలో కరెక్ట్ గా సరిపోతాడు. ఇతడు కనక ఇదే ఆటతీరును కొనసాగిస్తే.. పాండ్యా ప్లేస్ కు కచ్చితంగా ఎసరు పడే అవకాశం ఉంది. దీంతో పాండ్యాకు సరైనోడినే రోహిత్ దించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి హార్దిక్ కు దుబేనే సరైనోడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి