iDreamPost

Rohit Sharma: సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఏకైక కెప్టెన్ గా రికార్డు!

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Rohit Sharma: సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఏకైక కెప్టెన్ గా రికార్డు!

కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు లో టీమిండియా 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీంతో తొలి టెస్ట్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక ఈ విజయంతో పలు రికార్డులను కైవసం చేసుకుంది టీమిండియా. జట్టుతో పాటుగా ఓ అరుదైన రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ లో అద్భుతమైన కెప్టెన్సీతో అదరగొట్టాడు హిట్ మ్యాన్. పరిస్థితులకు తగ్గట్లుగా నిర్ణయాలను తీసుకుంటూ టీమ్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు రోహిత్ శర్మ.

రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా చేతిలో తొలి టెస్టు మ్యాచ్ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడు. ఆ మ్యాచ్ లో చేసిన తప్పిదాలను రెండో టెస్టులో పునరావృతం కాకుండా చూసుకున్నాడు. అద్భుతమైన కెప్టెన్సీతో జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. బౌలర్లను పిచ్ కు, పరిస్థితులకు తగ్గట్లుగా మార్చుతూ.. అసలైన నాయకుడు అనిపించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో 39 పరుగులతో రాణించాడు. కాగా.. ఈ విజయంతో హిట్ మ్యాన్ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

కేప్ టౌన్ వేదికలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఆసియా జట్టు కెప్టెన్ కూడా టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. తాజాగా ఈ విజయంతో ఈ రికార్డు సాధించిన ఏకైక సారథిగా రోహిత్ నిలిచాడు. అదీకాక సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ను డ్రాగా ముగించుకున్న రెండవ కెప్టెన్ గా మరో ఘనతకెక్కాడు. రోహిత్ కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ ను డ్రాగా ముగించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 55, రెండో ఇన్నింగ్స్ లో 176 పరుగులు చేయగా.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 153, రెండో ఇన్నింగ్స్ లో 80/3 పరుగులతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ ఘనత సాధించి ఏకైక ఆసియా కెప్టెన్ గా నిలిచిన రోహిత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి