iDreamPost

Rohit Sharma: వీడియో: ఇంగ్లండ్‌ టీమ్‌ను వెనక్కిపంపిన రోహిత్‌! మ్యాచ్‌లో ఊహించని ఘటన

  • Published Feb 18, 2024 | 5:46 PMUpdated Feb 19, 2024 | 4:02 PM

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా సూపర్‌ విక్టరీ కొట్టింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌ టీమ్‌ మొత్తాన్ని వెనక్కి పంపించాడు.

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా సూపర్‌ విక్టరీ కొట్టింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌ టీమ్‌ మొత్తాన్ని వెనక్కి పంపించాడు.

  • Published Feb 18, 2024 | 5:46 PMUpdated Feb 19, 2024 | 4:02 PM
Rohit Sharma: వీడియో: ఇంగ్లండ్‌ టీమ్‌ను వెనక్కిపంపిన రోహిత్‌! మ్యాచ్‌లో ఊహించని ఘటన

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసి ఇండియా.. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకే ఆలౌట్‌ చేసి.. 126 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ సాధించి.. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తర్వాగానే అవుటైనా.. మిగతా బ్యాటర్లు చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోర్‌ చేసింది. యువ ఓపెనర్‌ జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో దుమ్మరేపాడు. శుబ్‌మన్‌ గిల్‌ 91 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్‌ అవ్వడంతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ సైతం 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

మొత్తంగా 4 వికెట్ల కోల్పోయి 430 పరుగులు చేసి టీమిండియా.. ఇంగ్లండ్‌ ముందు 557 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసే క్రమంలో కాస్త గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జైస్వాల్‌ డబుల్‌ సెంచరీకి దగ్గర ఉండటంతో.. అతని డబుల్‌ సెంచరీ పూర్తి కాగానే రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేస్తారని అంతా భావించారు. అప్పటికే టీమిండియా లీడ్‌ 500 దాటిపోయింది. చూస్తుండగానే జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సర్ఫారాజ్‌ ఖాన్‌ సైతం హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97వ ఓవర్‌ ముగిసిన తర్వాత 412 పరుగుల వద్ద డ్రింక్స్‌ బ్రేక్‌ వచ్చింది. ఇంకేముంది ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ అనుకుని.. సర్ఫరాజ్‌-జైస్వాల్‌తో పాటు ఇంగ్లండ్‌ ఆటగాళ్ల కూడా గ్రౌండ్‌ నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు నడిచారు.

కానీ, డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి రోహిత్ శర్మ కేకలు పెడుతూ.. ఎవరు డిక్లేర్‌ ఇచ్చారు? ఎందుకు వస్తున్నారు? పోయి ఆడుపోండీ అంటూ జైస్వాల్‌-సర్ఫరాజ్‌పై కేకలేశాడు. తాను ఇంకా షూష్‌ కూడా వేసుకోలేదని, అప్పుడే ఎక్కడికి వస్తున్నారంటూ కోపంగా కనిపించాడు. దాంతో ఖంగుతిన్న సర్ఫరాజ్‌-జైస్వాల్‌ వెళ్లి హ్యాపీగా మరికొన్ని పరుగులు చేసుకున్నారు. కానీ, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో ఊహించని ఈ ఘటనతో అంతా షాక్‌ అయ్యాడు. అయితే.. ఆ వెంటనే 98వ ఓవర్ పూర్తి అయిన తర్వాత 430 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. ఇంగ్లండ్‌ ముందు 557 పరుగుల టార్గెట్‌ను ఉంచాడు. ఈ భారీ టార్గెట్‌ ఛేదించలేక.. ఇంగ్లండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. టీమిండియా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో డిక్లేర్‌పై తలెత్తిన గందరగోళంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి