iDreamPost

బాప్రే….యశ్ రెమ్యూనరేషన్ 150 కోట్లా?

Yash Remuneration: రాకింగ్ స్టార్ యష్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మార్మోగుతోంది. అందుకు కారణం రామాయణం సినిమా కోసం ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషనే కారణంగా చెప్తున్నారు.

Yash Remuneration: రాకింగ్ స్టార్ యష్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మార్మోగుతోంది. అందుకు కారణం రామాయణం సినిమా కోసం ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషనే కారణంగా చెప్తున్నారు.

బాప్రే….యశ్ రెమ్యూనరేషన్ 150 కోట్లా?

ఏ లాంగ్వేజ్ సినిమా అయినా కూడా, సినిమా అన్నది పాన్ ఇండియా రేంజ్ అందుకున్నాక ఆర్టిస్టులు బాగుపడ్డారు. సినిమా అన్నది రీజనల్ రేంజ్ లోనే ఉండిపోయి ఉంటే వాళ్ళ జీవితాలు కూడా గొర్రెతోక బెత్తెడులాగే ఉండిపోయి ఉండేవి. ఇప్పుడు చూడండి.. కేజీఎఫ్ ఫేం యశ్ ఓ హిందీ సినిమాకి గానూ ఏకంగా 150 కోట్లు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేయడం గొప్ప కాదు. నిర్మాతలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. అదే సినిమా అంటే రమేష్ తివారీ భారీ స్థాయిలో రెండు భాగాలుగా నిర్మిస్తున్న రామాయణం.

విలన్ కింత రెమ్యూనరేషనా అని అందరు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. విలన్ పాత్రకి ఇదే హయ్యస్ట్ అమౌంట్. ఇప్పటి వరకూ ఎవ్వరూ పుచ్చుకోనంత, ఎవ్వరికీ ఎవ్వరూ ఇవ్వనంత. అయితే రామాయణం సినిమాని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తారు. లేదా ప్రాంతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేసినా ఆశ్చర్యం లేనే లేదు. పైగా కేజీఎఫ్ ప్రాంచైజ్ బాక్సాఫీసు దగ్గర భారీ విస్ఫోటనాన్ని కలిగించింది కాబట్టి ఆలిండియా లెవెల్లో కూడా యశ్ తిరుగులేని ఇమేజ్ సాధించాడు. కాబట్టి యశ్ గ్యారెంటీగా రామాయణం చిత్రకావ్యానికి గ్రేట్ ప్లస్ పాయింట్ అయితీరుతాడు. డౌటే లేదు.

కాకపోతే సోషల్ మీడియా రాస్తున్నట్టుగా ఇది జస్ట్ విలన్ పాత్ర కాదు. మహోన్నతమైన రావణాసురుడి పాత్ర. రామాయణంలో రాముడు, సీత, హనుమంతులవారుతో పాటు రావాణాసురుడు కూడా అత్యంత ప్రధానమైన పాత్ర. అది అందరూ చేయగలిగేదీ కాదు. చేస్తే చూడగలిగేది కాదు. యశ్ లాటి గ్రేట్ పర్ఫార్మర్ అయితేనే రావణుడి పాత్రకు న్యాయం జరుగుతుంది. దర్శకుడి కష్టం పండుతుంది. నిజానికి రామానందసాగర్ తీసిన టీవి రామాయణంలో రావణాసురుడి పాత్రే పరమ వీక్. కానీ రామాయణం పిచ్చిలో అది కొట్టుకుపోయింది. ఇప్పటి రోజుల్లో ఆడియన్స్ ఆమోదం పొందడం అంత సులభం కాదు. పైగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రిలీజులు సర్వ సామాన్యమైపోయాయి.

అందుకే అంత గొప్ప పాత్ర యశ్ ని వెతుక్కుంటూ మరీ వచ్చింది. రెమ్యూనరేషన్ అంటారా ఇంత భారీ ప్రాజెక్టుకి, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి అదంత పెద్ద ఇబ్బంది కాదని నిర్మాతలు అనుకున్నారు. ఆరువందలు ఏడు వందల కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న కల్కి సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్న కమలహసన్ కూడా కేవలం రూ.25 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని వినికిడి. ఏది ఏమైనా విలన్ పాత్రలకు భారీ డిమాండ్ ఏర్పడింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ లో విలన్ గా చేసిన విజయ్ సేతుపతికి రూ.21 కోట్లు ఇచ్చారని అధికారిక సమాచారం. ఆదిపురుష్ కోసం సైఫ్ ఆలీఖాన్ కి రూ.10 కోట్లు, టైగర్ 3లో ఇమ్రాన్ హష్మీకి రూ.10 కోట్లు, కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ కి రూ.9 కోట్లు, పుష్పలో ఫహద్ ఫాజిల్ కి రూ.6 కోట్లు ఇచ్చినట్టుగా పక్కా సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి