iDreamPost

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ..!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ..!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్రగాయాలతో జీవితాన్ని నరకం అనుభవిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజే బాపట్ల జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. తాజాగా తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్  నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను.. ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. వర్ధన్నపేట మండలం ఇల్లందు సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. లారీ బలంగా ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే నలుగురు మృతి చెందారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ  చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. అలానే మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఆటో డ్రైవర్ తో పాటు రాజస్థాన్, బీహార్ ప్రాంతానికి చెందిన కూలీలు ఉన్నారు. వీరు తేనెను పట్టి, విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మృతుల్లో ఆటో డ్రైవర్ భట్టు  శ్రీనివాస్ ది వరంగల్ లోని శివనగర్. అలానే జాబోదు, నితీశ్, రూప్ చంద్ అనే వారు రాజస్థాన్ కి చెందిన వారు.  సురేష్, మేరి బిహార్ కు చెందిన వారని పోలీసులు  తెలిపారు. స్థానికులు సమాచారంతో  పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని  వరంగల్ సీపీ రంగనాథ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులను అడిగి ఆయన తెలుసుకున్నారు.

 

ఇదీ చదవండి: ఆపరేషన్ థియేటర్‌లో షార్ట్ సర్క్యూట్.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి