iDreamPost

ఎట్టకేలకు దిగొచ్చిన BCCI.. టీమిండియాలోకి రింకూ సింగ్‌!

  • Published Jul 07, 2023 | 4:56 PMUpdated Jul 07, 2023 | 4:56 PM
  • Published Jul 07, 2023 | 4:56 PMUpdated Jul 07, 2023 | 4:56 PM
ఎట్టకేలకు దిగొచ్చిన BCCI.. టీమిండియాలోకి రింకూ సింగ్‌!

టీమిండియాలో చోటు కోసం యువ క్రికెటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో చాలా మంది టాలెంటెడ్‌ కుర్రాళ్లు సత్తా చాటుతుండటంతో ఎవరిని ఎంపిక చేయాలో అర్థంకాక సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో కొంతమంది యువ ఆటగాళ్లకు చోటు దక్కలేదని క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేశారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న రింకూ సింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

అలాగే చెన్నై సూపర్‌ కింగ్స​ తరఫున ఆడుతున్న రుతురాజ్‌ గైక్వాడ్‌, పంజాబ్‌ కింగ్స్‌లో సత్తా చాటిన జితేష్‌ శర్మలను ఎంపిక చేయకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఫామ్‌లో లేని కొంతమంది ఆటగాళ్లును పట్టుకుని వేలాడుతున్న బీసీసీఐ అద్భుతంగా రాణిస్తున్న రింకూ, రుతురాజ్‌, జితేష్‌, నితీష్‌ రాణాలను మాత్రం పట్టించుకోవడం లేదని క్రికెట్‌ అభిమానులతో పాటు, క్రికెట్‌ నిపుణులు కూడా విమర్శించారు. దీంతో తన తప్పు తెలుసుకున్న బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు సమాచారం.

వెస్టిండీస్‌ టూర్‌ తర్వాత భారత జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం రింకూ సింగ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేసే ఆలోచనలో భారత సెలెక్టర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే రింకూ, రుతురాజ్‌కు మంచి అవకాశం దక్కినట్లే. తమని తాము నిరూపించుకుని టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకునేందుకు మంచి ఛాన్స్‌ ఉంటుంది. అలాగే ఆసియన్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్‌ జట్టులో కూడా మరికొంతమంది యువ క్రికెటర్లకు చోటు దక్కే అవకాశం ఉంది. మరి రింకూకు టీమిండియాలో చోటు దక్కనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి