iDreamPost

ప్రభాస్ ను ఢీకొంటున్న RGV! ‘కల్కి’ మూవీలో..

  • Author Soma Sekhar Updated - 05:36 PM, Wed - 6 September 23
  • Author Soma Sekhar Updated - 05:36 PM, Wed - 6 September 23
ప్రభాస్ ను ఢీకొంటున్న RGV! ‘కల్కి’ మూవీలో..

కల్కి 2898 AD.. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న చిత్రం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, దీపికా, అమితాబ్, కమల్ హాసన్ తో పాటుగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారింది. అదేంటంటే? కల్కి మూవీలో స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నటిస్తున్నాడంట.

కల్కి 2898 AD సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ఇప్పటికే స్టార్ క్యాస్ట్ తో నిండిపోయిన ఈ మూవీలో మరో స్టార్ యాక్ట్ చేస్తున్నాడట. అయితే ఈసారి యాక్ట్ చేసింది నటుడు కాదు.. డైరెక్టర్. అవును కల్కి సినిమాలో వివాదాస్పద డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ముద్రపడ్డ రామ్ గోపాల్ వర్మ నటించాడంట. అదీకాక ఆర్జీవీ తన షూటింగ్ ను సైతం కంప్లీట్ చేసుకున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చజరుగుతోంది.

అయితే ఈ విషయానికి సంబంధించిన మూవీ యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. కాగా.. ఇప్పటికే స్టార్ క్యాస్టింగ్ తో ముందుకెళ్తున్న కల్కి మూవీలోకి ఆర్జీవీ వచ్చాడన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేసిందనే చెప్పాలి. ఒకవేళ ఆర్జీవీ ఈ మూవీలో నటిస్తే.. ఏ పాత్ర చేశాడు? విలన్ గానా? లేక ఇంకేదైనా కీ రోల్ చేశాడా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభాస్, ఆర్జీవీని ఒకే స్క్రీన్ పై చూడాలని చాలా మందికి ఆశగా ఉంది. మరి వారి ఆశ నెరవేరుతుందో! లేదో చూడాలి. కల్కి మూవీలో ఆర్జీవీ నటిస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి