iDreamPost

టాలీవుడ్ కి iBOMMA సీరియస్ వార్నింగ్!

  • Author Soma Sekhar Updated - 04:00 PM, Wed - 6 September 23
  • Author Soma Sekhar Updated - 04:00 PM, Wed - 6 September 23
టాలీవుడ్ కి iBOMMA సీరియస్ వార్నింగ్!

iBOMMA.. సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని మూవీ లవర్ ఉండడు అంటే అతిశయోక్తికాదు. ఓటీటీలోకి వచ్చిన ప్రతీ సినిమా కొన్ని గంటల్లో ఐబొమ్మలోకి వచ్చి తీరుతుంది. ఇక రోజులు మారుతున్న కొద్దీ ఐబొమ్మ కూడా తన వెబ్ సైట్ లో మార్పులు చేస్తూ వచ్చింది. రిలీజ్ అయిన సినిమాలు ఐబొమ్మలోకి రావడంతో.. సినిమా ఇండస్ట్రీకి ఇది పెనుసవాల్ గా మారింది. దీంతో టాలీవుడ్ ఈ వెబ్ సైట్ పై ఫోకస్ పెట్టింది. దీంతో టాలీవుడ్ కు సీరియర్ వార్నింగ్ ఇచ్చింది ఐబొమ్మ. మీరు మా మీద ఫోకస్ పెడితే.. మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేసింది.

టాలీవుడ్ కు ఐబొమ్మ సీరియర్ వార్నింగ్ ఇచ్చింది. మీరు మా మీద ఫోకస్ పెడితే.. మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. అంటూ కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది ఐబొమ్మ. ఈ క్రమంలోనే ఓ నోట్ ను రిలీజ్ చేసింది. ఆ నోట్ లో ఐబొమ్మ యాజమాన్యం ఈ విధంగా రాసుకొచ్చింది.”మా వెబ్ సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి. మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మాకు మీపై ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుసు. మీరు డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రింట్ అమ్మిన తర్వాత మీకు ఏమీ తెలియనట్లు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా.. మీ ఓటీటీ రెవిన్యూ గురించి థింక్ చేస్తూ.. మాపై ఫోకస్ పెట్టారు. ఇక మీ నుంచి మీకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అందులో మెుదటిది హీరోల రెమ్యూనరేషన్. హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. లైట్ బాయ్స్ నుంచి సెట్ బాయ్స్ వరకు. వారికి కూలీ పెంచితే వారి కుటుంబాలు బాగుంటాయి కదా!

అలా కాకుండా విదేశాల్లో షూటింగ్స్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? మూవీ బడ్జెట్ లో రెమ్యూనరేషన్స్ కు విదేశాల్లో షూటింగ్సే ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఈ ఖర్చులన్నీ రాబట్టుకోవడానికి టికెట్స్ రేట్స్ పెంచుతున్నారు. దీంతో చివరికి సగటు ప్రేక్షకుడు నష్టపోతున్నాడు” అంటూ ఓ నోట్ ద్వారా వార్నింగ్ ఇచ్చింది. ఐబొమ్మ అనే వెబ్ సైట్ సిగరెట్ నుంచి e-సిగరెట్ కు యూజర్స్ ను మళ్లించే ప్రక్రియ మీ యాక్షన్ కు నా రియాక్షన్ ఉంటుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే మేము ఏ హిరోను కూడా టార్గెట్ చేయడం లేదంటూ విజయ్ దేవరకొండను ఉదాహరణగా చూపింది. మరి టాలీవుడ్ ఐబొమ్మ సీరియస్ వార్నింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి